Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ.. సినీ ఫక్కీలో ఘరానా మోసం!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌ 71లోని నవనిర్మాణ్‌ నగర్‌లో బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్‌ ఉద్యోగి భార్య శీలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన బెంగుళూరు నుంచి విమానంలో ఏప్రిల్ 20న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. ఎయిర్‌ పోర్టు నుంచి ట్యాక్సీ బుక్‌ చేసుకుని నవనిర్మాణ్‌నగర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫిలింఛాంబర్‌ ఎదురుగా విజేత సూపర్‌ మార్కెట్‌ వద్ద ట్యాక్సీ డ్రైవర్‌ కారును ఆపాడు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ.. సినీ ఫక్కీలో ఘరానా మోసం!
Diamond Jewelry Stolen In Jubilee Hills
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 26, 2024 | 9:20 AM

హైదరాబాద్, ఏప్రిల్ 26: మహానగరంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. ఓ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో రూ.కోటి విలువైన వజ్రాభరణాలు దొంగలు దొచుకెళ్లారు. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌ 71లోని నవనిర్మాణ్‌ నగర్‌లో బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్‌ ఉద్యోగి భార్య శీలతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన బెంగుళూరు నుంచి విమానంలో ఏప్రిల్ 20న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. ఎయిర్‌ పోర్టు నుంచి ట్యాక్సీ బుక్‌ చేసుకుని నవనిర్మాణ్‌నగర్‌లోని తన ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఫిలింఛాంబర్‌ ఎదురుగా విజేత సూపర్‌ మార్కెట్‌ వద్ద ట్యాక్సీ డ్రైవర్‌ కారును ఆపాడు. అనంతరం కారును శుభ్రం చేసుకుని.. ఆ తర్వాత కొద్దిసేపటికి వారిద్దరినీ ఇంటి వద్ద దింపాడు. కారు డిక్కీలో ఉన్న రెండు సూట్‌కేసులు తీసుకెళ్లి ఇంట్లో కూడా పెట్టాడు. ఆ తర్వాత పైకం పుచ్చుకుని ట్యాక్సీ డ్రైవర్‌ వెళ్లి పోయాడు. బాబ్జీ భాగవతుల, ఆయన భార్య ఈ నెల 24న సాయంత్రం బెంగళూరు నుంచి తమ వెంట తెచ్చుకున్న సూట్‌ కేసులను ఓపెన్‌ చేశారు. అందులో ఉన్న ఆభరణాలను భద్రపరిచేందుకు చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందులో ఉండాల్సిన కోట్ల విలువైన జ్యువెలరీ బాక్స్‌ కనిపించలేదు.

దీంతో ఆ దంపతులు తమ వెంట తెచ్చుకున్న రెండు సూట్‌ కేస్‌లను అణువణువునా చెక్‌ చేశారు. ఎక్కడా ఆ జ్యువెలరీ బాక్స్‌ కనిపించలేదు. అందులో 3 డైమండ్‌ నెక్లెస్‌లు, 3 జతల డైమండ్‌ చెవి కమ్మలు ఉన్నాయి. వీటి విలువ రూ.కోటి ఉంటుంది. దీంతో ఎక్కడ పొరబాటు జరిగిందో తెలియక భార్యభర్తలిద్దరూ తలలు పట్టుకున్నారు. దీనిపై వారు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమను ఎయిర్‌ పోర్టు నుంచి ఇంటికి తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దారి మధ్యలో కారును ఆపినప్పుడు డిక్కీలో ఉన్న తమ సూట్‌ కేస్‌ ఓపెన్‌ చేసి, వాటిని చోరీ చేసి ఉంటాడని ఆరోపించారు. లేదాంటే ఇంట్లోకి సూట్‌కేసులు తెచ్చే క్రమంలో జ్యువెలరీ బాక్స్‌ను చోరీ చేసి ఉండొచ్చని తెలిపారు. దీనిపై జూబ్లీహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లో ట్యాక్సీ ఎవరు బుక్‌ చేశారు? ట్యాక్సి నెంబర్‌, ట్యాక్సీ డ్రైవర్‌ పేరు, చిరునామా వంటి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.