AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘చదువు మాన్పించి పెళ్లి చేశారనీ..’ పురుగుల మందుతాగి నవ వధువు ఆత్మహత్య

ఉన్నత చదువు చదివి మంచి ఉద్యోగం చేయాలని ఎన్నో కలలు కనింది ఆ యువతి. కానీ కన్నవాళ్లు ఆమె కలలను అర్ధాంతరంగా చెరిపివేశారు. తల్లి అనారోగ్యం సాకుగా చూపి చదువు మాన్పించి పెళ్లి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం (ఏప్రిల్‌ 22) చోటు చేసుకుంది. ఎస్‌ఐ మాచినేని రవి తెలిపిన కథనం..

Telangana: 'చదువు మాన్పించి పెళ్లి చేశారనీ..' పురుగుల మందుతాగి నవ వధువు ఆత్మహత్య
Bhukya Devaki
Srilakshmi C
|

Updated on: Apr 23, 2024 | 9:51 AM

Share

భద్రాద్రి, ఏప్రిల్‌ 23: ఉన్నత చదువు చదివి మంచి ఉద్యోగం చేయాలని ఎన్నో కలలు కనింది ఆ యువతి. కానీ కన్నవాళ్లు ఆమె కలలను అర్ధాంతరంగా చెరిపివేశారు. తల్లి అనారోగ్యం సాకుగా చూపి చదువు మాన్పించి పెళ్లి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం (ఏప్రిల్‌ 22) చోటు చేసుకుంది. ఎస్‌ఐ మాచినేని రవి తెలిపిన కథనం ప్రకారం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మంగయ్యబంజర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శ్రీను, పద్మ దంపతుల కుమార్తె భూక్యా దేవకి (23). ఆమె కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కాలేజీలో చదువుతోంది. ఈ ఏడాదే డిగ్రీ కూడా పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత పై చదువులకు వెళ్తానని పట్టుబట్టింది. అయితే తల్లి తన ఆరోగ్యం బాగుండడం లేదనే సాకుతో కుమార్తెకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించింది. ఈ క్రమంలో అదే మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్‌ బాలరాజుతో వివాహం కుదిర్చారు. మార్చి 28న దేవకికి బాలరాజుతో వివాహం జరిపించి, అత్తరింటికి పంపించారు. ఈ నెల12న 16 రోజుల పండుగ నిమిత్తం నూతన వధూవరులను బంధువులు మంగయ్యబంజర్‌ తీసుకొచ్చారు. ఆ మరుపటి రోజే అంటే ఏప్రిల్‌13వ తేదీ అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దేవకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను జూలూరుపాడు ఆస్పత్రికి వైద్య చికిత్స కోసం తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కొత్తగూడెంకు తరలించారు.

మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కూడా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూసింది. దీంతో తల్లి భూక్యా పద్మ, తండ్రి శ్రీను కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్సై మాచినేని రవి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.