Chocolates: కిరాణా షాప్‌లో గడువు ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి.. అంతలోనే రక్తం వాంతులు చేసుకుంటూ..!

ఇంటి పక్కనున్న కిరాణా స్టోర్‌లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి చాక్లెట్‌ కొని తిన్నది. అయితే కాసేపటికే చిన్నారి రక్తం వాంతులు చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా ప్రమాదం తప్పింది. పోలీసులు, ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో బాలిక తిన్న చాక్లెట్ల గడువు ముగిసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన చాక్లెట్లు అమ్మిన షాపులోని ఇతర చాక్లెట్లు, ఇతర తినుబండారాలను..

Chocolates: కిరాణా షాప్‌లో గడువు ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి.. అంతలోనే రక్తం వాంతులు చేసుకుంటూ..!
representative image
Follow us

|

Updated on: Apr 21, 2024 | 9:19 AM

పాటియాలా, ఏప్రిల్ 21: ఇంటి పక్కనున్న కిరాణా స్టోర్‌లో కొన్నచాక్లెట్లను ఏడాదిన్నర వయసున్న చిన్నారి తిన్నది. అయితే కాసేపటికే చిన్నారి రక్తం వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా ప్రమాదం తప్పింది. పోలీసులు, ఆరోగ్య శాఖ జరిపిన విచారణలో బాలిక తిన్న చాక్లెట్ల గడువు ముగిసినట్లు తేలింది. ఈ నేపథ్యంలో గడువు ముగిసిన చాక్లెట్లు అమ్మిన షాపులోని ఇతర చాక్లెట్లు, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ షాకింగ్‌ సంఘటన జరిగింది. వివరాల్లోకెళ్తే..

లూథియానాకు చెందిన బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పాటియాలాలో బంధువుల ఇంటికి వెళ్లింది. విక్కీ గెహ్లాట్, స్థానిక కిరాణా దుకాణం నుంచి బాలిక కోసం బంధువులు చాక్లెట్ల బాక్స్‌ను కొనుగోలు చేశారు. సెండాఫ్‌ సందర్భంగా బంధువులు కొన్ని స్నాక్స్‌, చాక్లెట్లతో కూడిన బాక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. లూథియానాకు తిరిగి వచ్చిన తర్వాత చిన్నారి బాక్స్‌ ఓపెన్‌ చేసి, అందులోని చాక్లెట్లను తిన్నది. దీంతో ఆ పాప ఒక్కసారిగా రక్తం వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పరిస్థితి విషమించడంతో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించగా గడువు ముగిసిన చాక్లెట్లు తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు, రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు.

ఆరోగ్య అధికారుల బృందం సదరు కిరాణా దుకాణానికి చేరుకుని నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించింది. తనిఖీల్లో దుకాణంలో గడువు ముగిసిన తినుబండారాలు విక్రయిస్తున్నట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. దుకాణంలో గడువు ముగిసిన ఇతర చిరుతిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇదే ఏడాది మార్చిలో పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన బర్త్‌డే సందర్భంగా కేక్ తిని, ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కేక్‌ తిన్న బాలిక కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. విషపూరితంగా మారిన కేక్‌ తినడం వల్లనే బాలిక మృతి చెందినట్లు పోస్టుమార్టంలో నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Latest Articles
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
ఐటీఆర్‌ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి.. లేకుంటే రీఫండ్‌ రాదు
ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..
ఆఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నా అందాల ఆరబోతలో తగ్గేదే లే..
మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవాలంటే ఈ పొరపాట్లు చేయకండి
జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
జపాన్‌ను వణికిస్తున్న మాంసం తినే బ్యాక్టీరియా.. 48 గంటల్లోనే మరణం
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం..ఏమైందంటే?
శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాన్మరణం..ఏమైందంటే?
తెలంగాణ అధికారుల బదిలీపై కొలిక్కిరాని కస‌రత్తు..!
తెలంగాణ అధికారుల బదిలీపై కొలిక్కిరాని కస‌రత్తు..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇదే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం ఇదే
ఈ ఇద్దరూ ఒక్కటేనా..! మరీ ఇంత మార్పు ఏంటి అమ్మడు..!!
ఈ ఇద్దరూ ఒక్కటేనా..! మరీ ఇంత మార్పు ఏంటి అమ్మడు..!!
ఆర్డర్ పెట్టిన పార్శిల్ వచ్చేసింది.. ఆత్రంగా ఓపెన్ చేయగా....
ఆర్డర్ పెట్టిన పార్శిల్ వచ్చేసింది.. ఆత్రంగా ఓపెన్ చేయగా....
దగ్గు, జలుబును తరిమికొట్టే హోం రెమెడీస్‌.. అద్భుతమైన ఫలితాలు
దగ్గు, జలుబును తరిమికొట్టే హోం రెమెడీస్‌.. అద్భుతమైన ఫలితాలు
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
బాధ కలిగితే మనసారా ఏడ్చేయండి.. ఎన్ని లాభాలో తెలుసా.?
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
ఇజ్రాయెల్ కు షాక్‌.. హమాస్ దాడిలో 8 మంది సైనికులు హతం.
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అతిథి సత్కారాలలో 152 రకాల వంటకాలతో అదరహో అనిపించిన ఆంధ్రా వంటకాలు
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌రా బచ్చాస్‌.
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
విజయ్‌ సేతుపతి కాళ్లకు మొక్కిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. వీడియో
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారీ ఆంటీ.. ఈ సారి దశ తిరిగినట్టే.!
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
'నా మొగుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది' హీరోయిన్‌పై హీరో పెళ్లాం..
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
కార్తీక దీపం నటికి వింత అనుభవం.. బతికిపోయింది లేకపోతేనా.! వీడియో
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
మేడలు, మిద్దెలపై ఉండాల్సిన ట్యాంకులు పొలాల్లో ఎందుకున్నాయ్ ??
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..
పాకెట్ రాజ్యాంగానికి ఫుల్ డిమాండ్‌..