Avatar Biryani: ఆంటీ వండిన ‘అవతార్‌ బిర్యానీ’.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో! ‘బాబోయ్.. నీది మామూలు బుర్రకాదు’

బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, మష్రూమ్‌, థమ్‌, వెజిటముల్‌, పన్నీర్‌.. అబ్బో ఒకటేమిటి ఎన్ని రకాలుగా తయారు చేసినా అన్ని రకాల బిర్యానీలను రుచి చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు. మీరింత వరకూ రెస్టారెంట్‌ రుచుల నుంచి రోడ్డు పక్కన గల్లీ షాపుల వరకు ఎన్నో రకాల బిర్యానీలు లొట్టలేసుకుంటూ లాగించేసి ఉంటారు. నోట్లో వేసుకోగానే ఇట్టే గుటుక్కున జారిపోయే కమ్మని బిర్యానీ వాసన చూసినా చాలు..

Avatar Biryani: ఆంటీ వండిన 'అవతార్‌ బిర్యానీ'.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న వీడియో! 'బాబోయ్.. నీది మామూలు బుర్రకాదు'
Avatar Biryani
Follow us

|

Updated on: Apr 18, 2024 | 11:55 AM

బిర్యానీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. చికెన్‌, మటన్‌, ఫిష్‌, మష్రూమ్‌, థమ్‌, వెజిటముల్‌, పన్నీర్‌.. అబ్బో ఒకటేమిటి ఎన్ని రకాలుగా తయారు చేసినా అన్ని రకాల బిర్యానీలను రుచి చూడకుండా ఉండలేరు భోజన ప్రియులు. మీరింత వరకూ రెస్టారెంట్‌ రుచుల నుంచి రోడ్డు పక్కన గల్లీ షాపుల వరకు ఎన్నో రకాల బిర్యానీలు లొట్టలేసుకుంటూ లాగించేసి ఉంటారు. నోట్లో వేసుకోగానే ఇట్టే గుటుక్కున జారిపోయే కమ్మని బిర్యానీ వాసన చూసినా చాలు కడుపు నిండి పోతుంది. కానీ ఈ ఆంటీ చేసిన బిర్యానీ మాత్రం ‘మేము తినలేం బాబోబ్‌..’ అంటున్నారు నెటిజన్లు. తినేందుకేకాదు కనీసం చూసేందుకు కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. అదేంటీ అని అనుకుంటున్నారా? మరి ఇది అల్లాటప్ప బిర్యాని కాదుమరీ.. ‘అవతార్‌ బిర్యానీ’. ఇలాంటి బిర్యానీ మేమెప్పుడూ తినలేదే.. కనీసం పేరు కూడా ఎప్పుడూ వినలేదే అని నోరెళ్ల బెడుతున్నారా? అవతార్‌ సినిమా మాదిరి వేరే గ్రహంలో వండిన వంటకం కాదులెండి. ఈ వీడియో చూశారంటే మీ ఫ్యూజులు కచ్చితంగా ఎగిరిపోతాయ్‌..

ఈ వీడియోలో ఓ మహిల బ్లూ కలర్ నెయ్యి రైస్ తయారు చేయడం కనిపిస్తుంది. ముందుగా బటర్‌ ఫ్లై పీ ఫ్లవర్స్‌ తీసుకుని నీళ్లలో వేసి శుభ్రంగా కడుగుతుంది. ఆ తర్వాత వాటి రేకులను కాండం నుంచి వేరు చేస్తుంది. చూస్తాము. ఆ తర్వాత ఓ మట్టిపాత్రలో కొన్ని నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టి ఉంచుతుంది. ఓ మట్టి పాత్రను స్టౌవ్‌పై పెట్టి అందులో నీటిని పోసి మరిగిస్తుంది. మరిగిన నీళ్లలో పూల రేకులు వేసి కొద్దిసేపు తక్కువ మంట మీద ఉడకబెట్టిన తర్వాత, గరిటెతో అందులోని రేకులను తీసివేస్తుంది. నీళ్లన్నీ నీలం రంగులోకి మారడం వీడియలో కనిపిస్తుంది. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని పాత్రలోని నీలిరంగు నీళ్లలో వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించి.. ఆపై ఉప్పు, నెయ్యి కలుపుతుంది.

ఇవి కూడా చదవండి

మరొక మట్టిపాత్రలో మసాలా దినుసులు వేసి పోపు పెడుతుంది. అందులో బ్లూ రైస్‌ని మిక్స్ చేస్తుంది. అంతే బ్లూ కలర్‌ రైస్‌ రెడీ అయిపోతుంది. ఈ వీడియోను ది కుకింగ్‌ అమ్మ అనే యూజర్‌ 5 రోజుల క్రితం ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 12 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. లక్షల్లో లైకులు, కామెంట్లు రావడంతో ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు ఈ వంటకం చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. మహిళ క్రియేటివిటీని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరేమో ‘ఇదేం అన్నం బాబోయ్‌’ అంటూ గుడ్లు తేలేస్తు్న్నారు. ఈ క్రమంలో ఓ యూజర్‌ ‘అవతార్ బిర్యానీ’ అని ఈ వంటకానికి నామకరణం చేసేశాడు. మరొకరు ‘MI రైస్ ప్లేట్ MI అంటే ముంబై ఇండియన్స్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు)’ అని పేరు పెట్టాడు. ‘దేవుడా జన్మలో ఇలాంటి బిర్యానీ ముట్టుకోను.. బ్లూ కలర్‌ బిర్యానీ చూస్తుంటే ఆకలి చచ్చిపోయింది’ అంటూ మరొక యూజర్‌ తన అయిష్టాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకీ మీరేం అంటారు.. అవతార్ బిర్యానీ నచ్చిందా?

మరిన్ని వైరల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా