Hyderabad: సీరియల్‌ కిల్లర్‌ రాములుకు జీవత ఖైదు.. ఎట్టకేలకు శిక్ష ఖరారు చేసిన సంగారెడ్డి కోర్టు

దాదాపు పది మంది మహిళలను హత్య చేసి ఆభరణాలు దొంగిలించిన సీరియల్‌ కిల్లర్‌ ఎం రాములుకి సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2003 నుంచి తూప్రాన్‌, రాయదుర్గం, సంగారెడ్డి , దుండిగల్‌, నర్సాపూర్‌, నార్సింగి, కూకట్‌పల్లి, బోవెన్‌పల్లి, చందానగర్‌, శామీర్‌పేట, పటాన్‌చెరు, శామీర్‌పేటలో నమోదైన నాలుగు ఆస్తుల నేరాలు, 16 హత్య కేసులు సహా మొత్తం 21 కేసుల్లో ఎం రాములు అరెస్టయ్యాడు..

Hyderabad: సీరియల్‌ కిల్లర్‌ రాములుకు జీవత ఖైదు.. ఎట్టకేలకు శిక్ష ఖరారు చేసిన సంగారెడ్డి కోర్టు
Telangana Serial Killer M Ramulu
Follow us

|

Updated on: Apr 17, 2024 | 8:08 AM

పటాన్‌చెరు, ఏప్రిల్‌ 16: దాదాపు పది మంది మహిళలను హత్య చేసి ఆభరణాలు దొంగిలించిన సీరియల్‌ కిల్లర్‌ ఎం రాములుకి సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2003 నుంచి తూప్రాన్‌, రాయదుర్గం, సంగారెడ్డి , దుండిగల్‌, నర్సాపూర్‌, నార్సింగి, కూకట్‌పల్లి, బోవెన్‌పల్లి, చందానగర్‌, శామీర్‌పేట, పటాన్‌చెరు, శామీర్‌పేటలో నమోదైన నాలుగు ఆస్తుల నేరాలు, 16 హత్య కేసులు సహా మొత్తం 21 కేసుల్లో ఎం రాములు అరెస్టయ్యాడు.

అసలెవరీ రాములు?

సంగారెడ్డిజిల్లా ఆరుట్లకు చెందిన మాయని రాములు అలియాస్‌ మన్నె సాయిలు (42) డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశ, దుర్భుద్ధితో ఒంటరి మహిళలే లక్ష్యంగా ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడు. అతి కొద్ది బంగారం, వెండి అభరణాల కోసం నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. 2009లో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో రంగారెడ్డి జిల్లా స్థానిక కోర్టు రాములుకు జీవిత ఖైదు విధిస్తూ ఫిబ్రవరి 2011లో తీర్పునిచ్చింది. చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాములు 2011 డిసెంబర్ 30న ఎర్రగడ్డలోని మానసిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, అక్కడ మరో ఐదుగురితో కలిసి ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రి నుంచి తప్పించుకున్న తర్వాత బోవెన్‌పల్లి, చందానగర్, దుండిగల్‌లో రాములు మరో ఐదు హత్యలు చేశాడు.

అనంతరం 2013 మేలో బోవెన్‌పల్లి పోలీసులు రాములును అరెస్టు చేయగా.. హైకోర్టులో అప్పీలు చేసుకోవడంతో 2018 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత శామీర్‌పేటలో ఒకరిని హత్య చేశాడు. 2019 జూలై 11న రంగారెడ్డి జిల్లా గండీడ్‌ మండలం నాంచర్ల గ్రామానికి చెందిన అంజలమ్మ (40)ను పటాన్‌చెరు మండలం లక్డారంలోని లింగసానికుంట వద్ద గొంతునులిమి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.120 నగదు, సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. ఇలా మరో రెండు హత్యలు చేసి 2019లో అరెస్ట్ అయ్యాడు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా జూలై 31, 2020న రాములు బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. డిసెంబర్ 2020లో మరో రెండు హత్యలు చేశాడు. మృతులంతా మహిళలే కావడంతో పోలీసులు ఈ కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు.

అల్విన్‌ కాలనీ మహంకాళి టెంపుల్‌ అమ్మవారి మెడలో నుంచి 10 గ్రాముల గోల్డ్‌చైన్‌ దొంగతనం చేసిపట్టుబడిన రాములుపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇతని నేరాలను కోర్టులో సాక్ష్యాధారాలతో రుజువు చేయడంతో సంగారెడ్డి 2వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ డాక్టర్‌ పీపీ కృష్ణా అర్జున్‌ మంగళవారం నిందితుడు రాములుకి జీవిత ఖైదు శిక్షగా విధించారు. అలాగే రూ.3 వేల జరిమానా కూడా విధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.