Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఈ నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం..

వరంగల్‌‎లో కడియం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు తయారైంది పరిస్థితి. పార్టీ మారిన కడియం టార్గెట్‌గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. కడియం ద్వారా త్వరలోనే కాంగ్రెస్‎లో పెద్ద కుదుపు రాబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కడియం శ్రీహరి.

Telangana: లోక్ సభ ఎన్నికల వేళ ఈ నాయకుల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం..
Congress vs BRS
Follow us

|

Updated on: Apr 17, 2024 | 8:15 AM

వరంగల్‌‎లో కడియం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు తయారైంది పరిస్థితి. పార్టీ మారిన కడియం టార్గెట్‌గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు బీఆర్ఎస్ నేతలు. కడియం ద్వారా త్వరలోనే కాంగ్రెస్‎లో పెద్ద కుదుపు రాబోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు కడియం శ్రీహరి.

వరంగల్‌ జిల్లాలో రాజకీయం వేడేక్కింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత 15రోజుల వరకూ భాయ్ భాయ్ అంటూ తిరిగిన నేతలు.. ఒక్కసారిగా మెడలో కండువా మారడంతో బద్ద శత్రువులైపోయారు. నిన్నటి వరకూ కలుపుగోలుగా తిరిగిన నేతలు మాటల దాడి చేసుకుంటున్నారు. వరంగల్‌ ఎంపీ సీటు విషయంలో పార్టీ మారిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జంప్‌కి కారణం కడియం అంటూ ఆరోపించారు. వరంగల్‌ లోజరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్‌ లో కడియంపై ఫైర్ అయ్యారు.

కడియం శ్రీహరికి డాక్టర్‌ రాజయ్య సవాల్‌ విసిరారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. త్వరలో కడియం విదేశీ ఆస్తుల వివరాలు బయటపెడతానన్నారు. కడియంపై మాజీ మంత్రి దయాకర్ రావు సెటైర్లు వేశారు. కడియం జీవిత చరిత్ర మొత్తం తన చేతిలో ఉందన్నారు. టైం వచ్చిన రోజు బయటపెడతాన్నారు. కడియం శ్రీహరి వల్ల కాంగ్రెస్‎కి త్వరలో పెనుప్రమాదం పొంచిఉందంటూ పెద్ది సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2, 3 నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. దానంకు నోటీసులు వచ్చాయి. రేపో మాపో కడియంకు కూడా నోటీసులు వస్తాయన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజయ్యపై మండిపడ్డారు కడియంశ్రీహరి. లిఫ్ట్‌ ఇరిగేషన్‌లో పల్లా లంచాలు తీసుకుంటే.. దళితబంధులో రాజయ్య లంచాలు తీసుకున్నారని ఆరోపించారు కడియం. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కడియం అన్నట్లుగా మారింది రాజీయం. కడియం టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు ప్రచారం మొదలెట్టారు. ఈవిమర్శల దాడి ముందుముందు ఇంకెత వరకూ వెళ్తోందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది