Watch Video: కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలను చంపాల్సిన కర్మ ఎవరికి లేదన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకు వెళ్తున్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో క్యాంపేయింగ్ ముంగించారు. రథయాత్రలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలను చంపాల్సిన కర్మ ఎవరికి లేదన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకు వెళ్తున్న కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో క్యాంపేయింగ్ ముంగించారు. రథయాత్రలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భౌతికంగా కాదు రాజకీయంగానే పాతబస్తీ ముస్లిం సామాజికి వర్గానికి చెందిన ప్రజలు వారిని సమాధి కట్టేస్తారన్నారు. అక్బరుద్దీన్ కామెంట్లపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. తమపై కామెంట్లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరి ఎందుకని బీఆర్ఎస్ ఎంపీలను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు అని ప్రశ్నించారు. కేసిఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు దొందు దొందే అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని తాము ఎప్పుడో తొక్కేసామన్నది తెలుసుకోకుండా మళ్ళీ కేటీఆర్ తమపై కామెంట్లు చేయడం ఏంటని నిలదీశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

