‘కాంగ్రెస్‎ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులు కూల్చేస్తాం’.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్‎ను కేసిఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు.

'కాంగ్రెస్‎ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులు కూల్చేస్తాం'.. మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు..

|

Updated on: Apr 17, 2024 | 12:13 PM

కాంగ్రెస్‎ను కేసిఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పాలనను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖం చుడలేక కేసిఆర్ అసెంబ్లీకి రాలేదని ఆరోపించారు. తాము గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్‎లో ఎమ్మెల్యేలుగా ఉన్న సభ్యులు ఎవరూ మిగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోష్యం చెప్పారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి సీఎం అయ్యారని కొనియాడారు. మెదక్‎లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా బీఆర్ఎస్ గెలవదని చెప్పారు. కేసిఆర్ కుటుంబాన్ని చూస్తుంటే జాలి వేస్తోందన్నారు. సొంత బిడ్డ జైలుకు వెళ్తే.. కేసిఆర్ తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో జగదీష్ రెడ్డి జైలుకు వెళ్తారని హెచ్చిరించారు. రావులు అందరూ జైల్‎కు వెళ్తే చర్లపల్లి జైల్ సరిపోదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us
Latest Articles