'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ.. ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు..

‘తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న’ అక్భరుద్దీన్ ఓవైసీ.. ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు..

Noor Mohammed Shaik

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 11:45 AM

సీబీఐ, ఈడీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందని అక్బరుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్‌ను దక్కించుకున్నాం.. ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలన్నారు. లోక్‌ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సోదరులిద్దరినీ జైలుకు పంపి.. స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ 5 వ సారి పోటీ చేస్తున్నారన్నారు.

సీబీఐ, ఈడీ పేరు చెప్పి బీజేపీ భయపెట్టాలని చూస్తోందని అక్బరుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు త్యాగాలతో హైదరాబాద్‌ను దక్కించుకున్నాం.. ఇప్పుడు బీజేపీ నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవాలన్నారు. లోక్‌ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సోదరులిద్దరినీ జైలుకు పంపి.. స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీపై టార్గెట్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఎంఐఎం ఎంపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ 5 వ సారి పోటీ చేస్తున్నారన్నారు. గత 4 లోక్ సభ ఎన్నికల నుంచి 2004,2009, 2014,2019 ఎన్నిక్లలో ఇక్కడ నుంచి అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయం సాధిస్తున్నారన్నారు. తన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ గెలుపు కోసం కోసం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాత బస్తీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్థానికులను ఉద్దేశించి అక్బరుద్దీన్ మాట్లాడారు. ముస్లింలపై దాడులు జరిగితే ఎవరూ ముందుకు రారని.. కనీసం ఎవరూ ఖండించరని పేర్కొన్నారు. తమకు తామే రక్షణ కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్బరుద్దీన్ అన్నారు. 20 ఏళ్లుగా పాతబస్తీ అభివృద్ధి కోసం తన సోదరుడు అసదుద్దీన్ కృషి చేస్తున్నారని.. ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని అక్బరుద్దీన్ అన్నారు. అసదుద్దీన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పాతబస్తీ ప్రజలకు అక్బరుద్దీన్‌ పిలుపు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Apr 18, 2024 11:45 AM