TSRTC: భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక శ్రీరామనవి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచలం చేరుకుంటారు.

TSRTC: భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

|

Updated on: Apr 16, 2024 | 8:04 PM

శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇక శ్రీరామనవి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచలం చేరుకుంటారు. ఇక సీతారాముల కళ్యాణోత్సవంలో తలంబ్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంట్లో ఉంటే శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వీటికోసమే భద్రాచలం వెళ్లే వారు కూడా ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త తెలిపింది. ఇంట్లోనే ఉండి భద్రాద్రి రామయ్య తలంబ్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది.

ప్రతీ ఏటా లాగే ఈసారి కూడా దేవదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రన్ని చేపట్టారు. ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పించిందని తెలిపారు. ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందండి అని సజ్జనార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌లో తలంబ్రాలను ఎలా బుక్‌ చేసుకోవాలో వివరిస్తున్న వీడియోను షేర్‌ చేశారు. అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా తలంబ్రాలను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440069ను సంప్రదించాలని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB