Priyamani: అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్

Priyamani: అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్

Anil kumar poka

|

Updated on: Apr 16, 2024 | 7:56 PM

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్‌ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పటికీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ లోనికి అడుగు పెట్టిన ప్రియమణి .. జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తాజాగా మైదాన్ సినిమాలోనూ నటించారు.

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ స్టార్‌ హీరోయిన్స్‌లో ప్రియమణి ఒకరు. తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ఇప్పటికీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ లోనికి అడుగు పెట్టిన ప్రియమణి .. జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తాజాగా మైదాన్ సినిమాలోనూ నటించారు. ప్రియమణి, అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రియమణి నటనకు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. ప్రియమణి ముస్తఫా రాజ్‌ని పెళ్లి చేసుకున్నారు. కాగా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆమెను చాలా మంది ట్రోల్ చేశారు. ఈ్రకమంలో ఆ ట్రోల్స్ మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేశాయా అనే ప్రశ్నకు తనదైనశైలిలో బదులిచ్చారు.

ఆ ట్రోల్స్‌ తననుగాని, తన తల్లిదండ్రులను కానీ ప్రభావితం చేయలేదని, ఆ సమయంలో తన భర్త తన అండగా నిలబడ్డారని తెలిపారు. తను ముస్తఫా రాజ్‌తో డేటింగ్‌లో ఉన్నప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో తనతో ఉండమని, తనను నమ్మమని చెప్పానని తెలిపారు. తాము మా జీవితమంతా ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నాము, కాబట్టి ఈ పయనంలో ఏ సమస్య వచ్చినా, ఇద్దరం కలిసి ఎదుర్కొంటామని తెలిపారు. అలాంటి అవగాహన ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం ఆనందంగా ఉందన్నారు ప్రియమణి. అన్ని సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసని వివరించారు. తమ పై వచ్చిన ట్రోల్స్ కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వలేదన్నారు. విమర్శల గురించి పెద్దగా ఆలోచించవద్దని, చివరికి తామిద్దరం కలిసి ఉండటమే ముఖ్యమని ముస్తాఫా చెప్పారని ప్రియమణి తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!