Chiranjeevi: ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుమారుడు రామ్‌చరణ్‌తో పోటీపడిమరీ సినిమాలు చేస్తున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ సినిమా వల్ల తాను చాలా నష్టపోయానని తెలిపారు.

Chiranjeevi: ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.

|

Updated on: Apr 16, 2024 | 7:39 PM

చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. సైరా నరసింహారెడ్డి సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మించారు. ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. అయితే అన్ని భాషల్లో ఈ సినిమా వర్కౌట్ కాలేదు. కొన్ని చోట్ల ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి. మెగాస్టార్ మాట్లాడుతూ.. సైరా నరసింహారెడ్డి సినిమా నష్టాలు మిగిల్చిన మాట వాస్తవమే అన్నారు. అలాగే చిరు మాట్లాడుతూ.. తాను చాలా సినిమాలు చేశానని, ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించినా.. స్వాతంత్ర్య సమరయోధుడిగా నటించాలని చాలా కోరిక ఉండేదన్నారు. అందుకు చాలా కాలంగా ఎదురుచూసిన తనకు .. సైరాతో ఆ కోరిక తీరిందని తెలిపారు. ఆ సినిమా రెండు రాష్ట్రాల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. మిగిలిన భాషల్లో పర్లేదు అనిపించుకుంది. దాంతో మాకు నష్టాలూ వచ్చాయి. గతంలో కూడా రుద్రవీణ అనే సినిమా చేశా.. ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. కానీ డబ్బులు మాత్రం రాలేదు. ఈ సినిమాకు తమ్ముడు నాగబాబు నిర్మాతగా వ్యవహరించాడు. అందుకే నా సంతృప్తి కోసం సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నా అని అన్నారు చిరంజీవి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles