Tanikella Bharani: నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి.

Tanikella Bharani: నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి.

Anil kumar poka

|

Updated on: Apr 16, 2024 | 8:25 PM

సినీ రచయితగా ఆయన అనేక సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత నటుడిగా కేరక్టర్‌ రోల్స్‌కు న్యాయం చేశారు. దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్నారు. ఆయనే తనికెళ్ల భరణి. 'ఆటగదరా శివా' అంటూ ఆయన సరళమైన భాషలో జీవన సత్యాన్ని పాట రూపంలో అందించి జనం మనసుల్ని గెలుచుకున్నారు. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

సినీ రచయితగా ఆయన అనేక సినిమాలకు పనిచేశారు. ఆ తరువాత నటుడిగా కేరక్టర్‌ రోల్స్‌కు న్యాయం చేశారు. దర్శకుడిగా మారి తన ప్రతిభను చాటుకున్నారు. ఆయనే తనికెళ్ల భరణి. ‘ఆటగదరా శివా’ అంటూ ఆయన సరళమైన భాషలో జీవన సత్యాన్ని పాట రూపంలో అందించి జనం మనసుల్ని గెలుచుకున్నారు. తాజాగా ఓ యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. శివుడు తన జీవితంలోకి వచ్చాక అద్భుతాలు జరిగాయనీ చెప్పారు. ‘ఆటగదరా శివా ‘ను దేశం నలుమూలలా పాడాలని ఉందని శివయ్యతో అన్నట్లు తెలిపారు. అవకాశం కల్పిస్తే వివిధ దేశాలలోని తెలుగు వాళ్లకి ఈ సాహిత్యాన్ని వినిపిస్తానని మనసులోనే శివయ్యకి చెప్పుకున్నట్లు అన్నారు. ఆశ్చర్యంగా ఆ తరువాత తాను అనేక దేశాలలో పర్యటించాననీ అక్కడి స్టేజ్ లపై ‘ఆటగదరా శివా’ను పాడాననీ అన్నారు.

ఒకసారి తన ఫ్యామిలీ అంతా కలిసి తంజావూరు వెళ్లిన సందర్భంలో అక్కడ కొన్ని కారణాల వలన ఆ రోజు బంద్ జరుగుతోందనీ భోజనం కాదు గదా కనీసం కాఫీ కూడా దొరికే పరిస్థితి లేదనీ అన్నారు. మధ్యాహ్నం 2 అవుతోందనీ తమకు విపరీతమైన ఆకలి వేస్తోందనీ ఆ సమయంలో తనకు తెలిసిన ఒక హోటల్‌కి సంబంధించిన వ్యక్తి తమను తీసుకుని వెళ్లి .. తమకు ఇష్టమైన భోజనం వండి పెట్టాడనీ ఇదంతా శివయ్య కృప కాక మరేమిటి? అంటూ ఆ సంఘటనను మరోసారి గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!