Sandeep Reddy Vanga: ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్ యూనివర్స్.? సందీప్ రెడ్డి వంగా.?
కథ ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేది సీక్వెల్ అయితే, కథలతో సంబంధం లేకుండా, పాత్రల్ని కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందించడాన్ని సినిమాటిక్ యూనివర్స్‌గా పిలుస్తారు. ఇండియన్ ఇండస్ట్రీలో తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో ఈ కాన్సెప్ట్‌కు నాంది పలికారు. టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమాటిక్ యూనివర్స్ పై స్పందించారు.
కథ ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేది సీక్వెల్ అయితే, కథలతో సంబంధం లేకుండా, పాత్రల్ని కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందించడాన్ని సినిమాటిక్ యూనివర్స్‌గా పిలుస్తారు. ఇండియన్ ఇండస్ట్రీలో తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో ఈ కాన్సెప్ట్‌కు నాంది పలికారు. టాలీవుడ్‌లోనూ అలాంటి ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. యానిమల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా సినిమాటిక్ యూనివర్స్ పై స్పందించారు. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ప్రభాస్ ఈ నలుగురితో యూనివర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందా? అని చెన్నైలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో హోస్ట్ అడగ్గా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదన్నారు. ఒకవేళ ఏదైనా మంచి పాయింట్ మదిలో మెదిలితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. యానిమల్‌లోని హీరో పాత్రకు ఏ తమిళ నటుడు సూట్ అవుతారని అడగ్గా సూర్య అని తెలిపారు. సందీప్ విషయంలో ఆ నలుగురు కథానాయకులని ప్రస్తావించడానికి కారణం.. వారితో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు ఇప్పటికే ఆయన తెరకెక్కించగా త్వరలోనే ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని తీయనున్నారు. యానిమల్ సీక్వెల్‌ని 2026లో ప్రారంభిస్తామన్నారు సందీప్ రెడ్డి వంగా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

