AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 12th ఫెయిల్ సినిమా రిపీట్.. సామాన్యుడిని వరించిన సివిల్స్..

అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతూ విగతజీవిగా మారిన తండ్రి.. బీడీలు చుడుతున్న తల్లి.. కడుపేదరికంలో బాధపడ్డ యువకుడు. ఓ వైపు ఉద్యోగం.. మరో వైపు చదువు రెండింటిపై దృష్టి పెట్టాడు సాయి కిరణ్. బీటెక్ చేసి ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు ఆ యువకుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడం.. ముందుకు సాగాలా.. వెనక్కి తగ్గాలా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడాడు.

తెలంగాణలో 12th ఫెయిల్ సినిమా రిపీట్.. సామాన్యుడిని వరించిన సివిల్స్..
Sai Kiran Civils 29th Ranke
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Apr 17, 2024 | 8:41 AM

Share

అనారోగ్యం బారినపడి మృత్యువుతో పోరాడుతూ విగతజీవిగా మారిన తండ్రి.. బీడీలు చుడుతున్న తల్లి.. కడుపేదరికంలో బాధపడ్డ యువకుడు. ఓ వైపు ఉద్యోగం.. మరో వైపు చదువు రెండింటిపై దృష్టి పెట్టాడు సాయి కిరణ్. బీటెక్ చేసి ఏదో సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు ఆ యువకుడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడం.. ముందుకు సాగాలా.. వెనక్కి తగ్గాలా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడాడు. కళ్ల ముందు సాక్షాత్కరించిన కష్టాలను గుండెల్లో పదిలంగా దాచుకుని తన పయనం ముందుకు సాగడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. ఇలా నిర్దేశించుకున్నకిరణ్ యూపీఎస్సీలో 27వ ర్యాంకు సాధించాడు.

కరీంనగర్ జిల్లాకు చెందిన నందాల సాయి కిరణ్ జీవితంలోకి తొంగి చూస్తే ప్రస్తుతం కొండంత ఆనందం కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల కాంతయ్య మహారాష్ట్రలోని భీవండిలో పవర్ లూమ్స్ కార్మికునిగా పనిచేస్తుండగా క్యాన్సర్ బారిన పడడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ తల్లి లక్ష్మీ జీవనం సాగించారు. బీడీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో అటు కటుంబాన్ని పోషిస్తూ.. ఇటు పిల్లలను చదివించారు. తల్లి కష్టం చూస్తూ పెరిగిన బిడ్డలు ఈ కష్టాలకు పుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతోనే చదువులో రాణించారు. కూతురు స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుని మిషన్ భగీరథలో ఏఈఈగా ఉద్యోగం చేస్తున్నారు.

సాఫ్ట్ జాబ్.. హార్ట్ టార్గెట్..

కుటుంబ స్థితి గతుల దృష్ట్యా జాబ్ చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ కావల్సిన పరిస్థితి సాయి కిరణ్ ది. తొలిసారి ప్రయత్నంలో విఫలం కావడంతో ఉద్యోగం వదిలేసి సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకున్నాడు. కానీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఉన్న ఉద్యోగం వదులకుంటే ఇబ్బందని బంధువులు చెప్పడంతో అటు ఉద్యోగం చేస్తూనే ఇటు కోచింగ్ తీసుకున్నాడు. తన బాబాయ్ శ్రీనివాస్‎తో మాట్లాడినప్పుడల్లా తాను సివిల్స్ కొట్టి గోల్ రీచ్ అవుతానంటూ ఘంటా పథంగా చెప్పేవాడు. అదే మార్గంలో ప్రయాణించి సాయి కిరణ్ రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ 27వ ర్యాంకు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించే వారు లేకున్నా తనకు తానే టార్గెట్ ఫిక్స్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. సివిల్ప్ ప్రిపేరేషన్ అనగానే భారీ కసరత్తులు చేయాల్సి వస్తోందన్న భయం వెంటాడుతున్న వారికి సాయి కిరణ్ ఛేజింగ్ స్టైల్ ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తండ్రి మరణించడంతో తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తీరును కళ్లారా చూసిన ఆ బిడ్డ తన లక్ష్యాన్ని ముద్దాడిన తీరు పదే పదే నిరాశకు గురయ్యే వారంతా ఫాలో అయితే సక్సెస్ దానంతట అదే వస్తుందని గుర్తు చేస్తోంది. ఆయన కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు కావల్సిన లిట్రేచర్‎తో పాటు కోచింగ్‎కు అవసరమైన డబ్బును సమకూర్చుకుంటూ.. అక్క ప్రోత్సాహంతో ముందుకు సాగిన తీరు నేటి తరానికి రోల్ మోడల్ అనే చెప్పాలి. సాయి కిరణ్ జీవన గమనాన్ని తెలుసుకుంటే అమ్మో సివిల్సా అని భయపడే యువతలో సరికొత్త ఆశ చిగురించడం ఖాయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..