UTS app: రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

దగ్గరైనా, దూరమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువమంది ఇష్టపడేది ట్రైన్‌ జర్నీనే. సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను UTS యాప్‌ను ప్రారంభించింది.

UTS app: రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

|

Updated on: Apr 18, 2024 | 11:56 AM

దగ్గరైనా, దూరమైనా.. సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎక్కువమంది ఇష్టపడేది ట్రైన్‌ జర్నీనే. సాధారణంగా బెర్త్‌ బుక్‌ చేసుకోవాలంటే చాలా రోజుల ముందే టికెట్ బుక్‌ చేసుకోవాలి. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ను UTS యాప్‌ను ప్రారంభించింది. ఒకప్పుడు తక్కువ దూరం ప్రయాణం, క్విక్‌ బుకింగ్‌, ప్లాట్‌ఫాం టికెట్‌, సీజన్‌ టికెట్‌, క్యూఆర్‌ బుకింగ్‌ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్‌.. ఇప్పుడు నాన్‌-సబర్బన్‌ ట్రావెల్‌ టికెట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటునూ అందిస్తోంది. అంటే 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న ప్రయాణానికి కూడా మూడు రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చన్నమాట. 200 కి.మీ. కంటే తక్కువ దూరం ఉంటే ప్రయాణం రోజే టికెట్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

UTS యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడినుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్‌తో పాటు చేరుకోవాల్సిన స్టేషన్‌ను ఎంచుకోవాలి. ట్రైన్‌లు, వాటి ఛార్జీలు డిస్‌ప్లే అవుతాయి. ఆర్‌- వాలెట్‌, UPI.. ఈ చెల్లింపు ఎంపికల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ బుక్‌ చేసే ముందు పేపర్‌ మోడ్‌ ఎంచుకుంటే దగ్గరల్లోని UTS కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి ప్రింట్‌ తీసుకోవాలి. ఆర్‌- వాలెట్‌ను టాప్‌- అప్‌ చేయడం తప్పనిసరి కాదు. ఒకవేళ చేస్తే వాలెట్‌ టాప్‌-అప్‌పై 3 శాతం బోనస్‌ లభిస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మే 1, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే