Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌.. 40 మంది మావోయిస్టుల మృతి! పక్కా సమాచారంతో కూంబింగ్‌

పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు..

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో భారీ ఎన్‌కౌంటర్‌.. 40 మంది మావోయిస్టుల మృతి! పక్కా సమాచారంతో కూంబింగ్‌
Chhattisgarh Encounter
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2024 | 7:08 AM

ఛత్తీస్‌గఢ్‌, ఏప్రిల్ 19: పార్లమెంట్‌ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ అడవుల్లో రక్తం ఏరులై పారింది. పచ్చని అడవులు ఎర్రని రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు40 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ 29 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించారు. వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. మృతుల్లో మరికొందరు తెలంగాణ వాసులు ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానుండగా ఆ రాష్ట్రంలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ఏడాదిలో 4 నెలల వ్యవధిలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోలు మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బీఎస్‌ఎఫ్, డీఆర్‌జీ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 40 మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని బస్తర్‌ ఐజీ పి సుందర్‌రాజ్, ఎస్పీ కళ్యాణ్‌ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ సుగులూరి చిన్నన్న అలియాస్‌ విజయ్, అలియాస్‌ శంకర్‌రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్‌ ఘటనాస్థలి నుంచి భారీ యెత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌ రైఫిళ్లు, కార్బైన్‌, 303 రైపిల్స్‌ వంటి ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సహా ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి.

దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ స్టేట్‌ మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జి రాంధర్‌ అలియాస్‌ మజ్జిదేవ్‌ కూడా మరణించినట్లు సమాచారం. గత పదిహేనేళ్లలో బస్తర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతి పెద్దదిగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్‌ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ సమావేశానికి సీపీఐ(మావోయిస్టు) బస్తర్‌ డివిజన్‌ నేతలు శంకర్‌, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో బీఎస్‌ఎఫ్‌, జిల్లా రిజర్వు గార్డు (డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా చోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఎన్‌కౌంటర్‌ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్‌, ఆయన భార్య లలిత ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!