Sri Rama Navami 2024: బాలరాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు.. అయోధ్యలో అద్భుత దృశ్యం.. ఈ ఒక్క రోజు మాత్రమే..

శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేద్ధీప్యామానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్య అభిషేకం జరుగుతుంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి గతంలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది.

Sri Rama Navami 2024: బాలరాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు.. అయోధ్యలో అద్భుత దృశ్యం.. ఈ ఒక్క రోజు మాత్రమే..
Ram Lalla Surya Tilak
Follow us

|

Updated on: Apr 17, 2024 | 11:10 AM

జై శ్రీరామ్..ఎక్కడ చూసినా నేడు శ్రీరామనామ స్మరణతో మార్మొగుతుంది. ఇక రామనవమి సందర్భంగా ప్రపంచంలోనే అయోధ్య ప్రత్యేకం కానుంది. రాంలాలా పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, రామలల్లా ప్రతిష్ఠాపన తర్వాత ఇదే మొదటి రామ నవమి (రామ నవమి 2024)కావడంతో ఇక్కడ ప్రత్యేక సన్నాహాలు జరిగాయి. ఏన్నేళ్లైన చెక్కుచెదరని కళాఖండంలా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే దర్శనమిస్తాయి.. అందులో ఒకటి సూర్య తిలకం. సూర్య అభిషేకం లేదా సూర్య తిలకం అని పిలువబడే ఆచారంలో సూర్యుడు బాలరాముడి నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలో ఉండే రాముడి నుదుటిపై మధ్యాహ్నం 12 గంటలకు, రాముడు జన్మించిన సమయంలో సూర్య తిలకం రాంలాలా నుదిటిపై ఆవిషృతమవుతుంది. దీని కోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేద్ధీప్యామానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్య అభిషేకం జరుగుతుంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి గతంలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది.

రాముడి నుదుటన సూర్య తిలకం..

రామ నవమి రోజున, సూర్యకాంతి ఆలయం మూడవ అంతస్తులో అమర్చిన మొదటి అద్దంపై పడుతుందని, ఇక్కడ నుండి ప్రతిబింబిస్తుంది. ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత ఇది ఇత్తడి పైపులో అమర్చబడిన రెండవ అద్దాన్ని తాకుతుంది. 90 డిగ్రీల వద్ద మళ్లీ ప్రతిబింబిస్తుంది. దీని తరువాత ఇత్తడి పైపు గుండా వెళుతున్నప్పుడు, ఈ కిరణం మూడు వేర్వేరు లెన్స్‌ల గుండా ప్రవహించి, పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది.

ఇవి కూడా చదవండి

గర్భగుడిలో అమర్చిన అద్దాన్ని తాకిన సూర్య కిరణాలు నేరుగా రామ్లాలా నుదుటిపై 75 మిమీ వృత్తాకార తిలకాన్ని వర్తిస్తాయి. అది సుమారు 6 నిమిషాల పాటు ప్రకాశిస్తుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక ఆప్టో-మెకానికల్ వ్యవస్థను సిద్ధం చేశారని, ఇది రామ నవమి రోజున మాత్రమే రామ మందిరం గర్భగుడిలో ఆవిష్కృతం కానుంది. ఏటా శ్రీ రామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు..అంటే రామయ్య కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నానికి కొద్దిసేపు ముందు మొదలయ్యే సూర్య కిరణాల వెలుగు 6 నిమిషాల పాటు కొనసాగనుంది.

సూర్య కిరణాలు రామచంద్రుడి నుదిటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి నేరుగా బాలరాముడి నుదుటిపై కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ వీరికి తోడ్పాటునందించింది. ఇందుకు అవసరమైన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసి అందించినట్టుగా తెలిసింది. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తైందని ఆయోధ్య ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మరికొన్ని గంటల్లో రామ్ లల్లా నుదుటిపై అద్భుతమైన సూర్య తిలకం ఉంటుంది. ఆ సుందర దృశ్యాన్ని కనువిందుగా తిలకించేందుకు రామ భక్తులు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..