AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ram Navami: హనుమంతుడు లేని ఒకే ఒక రామాలయం ఎక్కడుంది.. ఎందుకో తెలుసా..

శ్రీరాముడు యావత్ ప్రపంచానికికే దార్శనికుడు. కుటుంబం, పరిపాలనా దక్షత, సంసారం, జీవన విధానం, పితృవాఖ్యపరిపాలన ఇలా అనేక గుణ గణాలకు ఆదర్శమూర్తిగా నిలిచారు. అయితే మనకు శ్రీరాముడు అనగానే గుర్తుకు వచ్చేది రెండే దేవాలయాలు. ఒకటి తెలంగాణ భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, మరొకటి కడపజిల్లాలోని ఒంటిమిట్ట. ఈ రెండు ఆలయాలు పురాణ ప్రాశస్థ్యాన్ని పొంది ఉన్నాయి.

Sri Ram Navami: హనుమంతుడు లేని ఒకే ఒక రామాలయం ఎక్కడుంది.. ఎందుకో తెలుసా..
Ontimitta
Srikar T
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 17, 2024 | 12:16 PM

Share

శ్రీరాముడు యావత్ ప్రపంచానికికే దార్శనికుడు. కుటుంబం, పరిపాలనా దక్షత, సంసారం, జీవన విధానం, పితృవాఖ్యపరిపాలన ఇలా అనేక గుణ గణాలకు ఆదర్శమూర్తిగా నిలిచారు. అయితే మనకు శ్రీరాముడు అనగానే గుర్తుకు వచ్చేది రెండే దేవాలయాలు. ఒకటి తెలంగాణ భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, మరొకటి కడపజిల్లాలోని ఒంటిమిట్ట. ఈ రెండు ఆలయాలు పురాణ ప్రాశస్థ్యాన్ని పొంది ఉన్నాయి. ఒకటి తానిషా ప్రభువుల కాలంలో రామదాసు నిర్మించినది అయితే మరొకటి త్రేతాయుగంలో జాంబవంతుడి కాలంలో ప్రతిష్ఠించినది. ఒంటిమిట్ట దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ మూడు ప్రధాన ద్వారాలు మాత్రమే ఉంటాయి. ప్రధాన గాలిగోపురానికి ఉత్తర, దక్షిణంవైపు మాత్రమే గాలిగోపురాలు ఉండటం ప్రత్యేకత. ఇవి కూడా ప్రధాన గోపురానికి కంటే చిన్నవిగా ఉంటాయి. ఈ రామాలయంలో నవమి రోజు కాకుండా పౌర్ణమి రోజున సీతాదేవి సమేత కోదండ రామ స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అదికూడా పండువెన్నెల్లో ఆరుబయట కళ్యాణాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ప్రస్తుతం ఈ ఆలయం టీటీడీ ఆధీనంలో ఉంది. ప్రతి ఏటా వీరే ఇక్కడి ఉత్సవాలను అంగరంగవైభవంగా, వైఖానస శాస్త్రం ప్రకారం అన్ని కైంకర్యాలను నిర్వహిస్తారు.

హనుమంతుడు లేని రామాలయం..

కడపజిల్లా ఒంటిమిట్టలో ఉంటే కోదండరామాలయంలో హనుమంతుడు ఎక్కడా కనిపించడు. ఒకే శిలలో సీతా,రామ,లక్ష్మణుల ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. ఈ విగ్రహాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడు ప్రతిష్టించినదిగా చెబుతారు. అప్పడు వనవాస సమయంలో శ్రీరామునికి ఇంకా హనుమంతుడు పరిచయం ఏర్పడలేని కారణంగా ఇక్కడ ఆంజనేయుడి ప్రస్థావన లేదని పురాణ ప్రతీతి. మనకు రామాయణం ప్రకారం కిష్కిందకాండలో హనుమంతుడికి శ్రీరామునికి మధ్య మైత్రి ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే అరణ్యకాండలో చెప్పిన విధంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణునితో ఈ స్థలంలో సేదతీరినట్లు ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. లక్ష్మణునికి దాహం వేసిన సందర్భంగా బాణాలను భూమిపై సందించి నీటిని తీసిన ప్రాంతమే లక్ష్మణ కోనేరుగా నేటికీ ఉందని చెబుతారు ఆలయ పండితులు.

ఒంటిమిట్ట – ఏకశిలానగరం..

ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు గ్రామంలో దొంగతనాలకు పాల్పడి ఈ కొండపై సేదతీరే సమయంలో శ్రీరాముడు వారికి స్వప్నంలో కనిపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఆ పేరు రావడానికి కారణం ఒంటుడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందుకే వారి పేరు మీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఏకశిలానగరం అని కూడా అంటారు. సీతాదేవి, రాముడు, లక్ష్మణ ప్రతిమలను ఒకే రాతిలో చెక్కబడి ఉండటమే ఈ పేరు రావడానికి కారణం. అందుకే దీనికి మోనోలిథిక్ సిటీ అని పేరు వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..