Indian Railways: రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!

మధురై-గురువాయూర్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము ప్రవేశించి సీటు కింద నక్కింది. అదే ట్రైన్‌లో మధురైకి చెందిన కార్తీక్ అనే ప్రయాణికుడిని అది కాటు వేసింది. దీంతో బాధితుడిని ఎట్టుమనూరు స్టేషన్‌లో దించి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆరో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని పాము కాటు వేసినట్లు తెలుస్తోంది. అదే బోగీలో సీటు కింద ఉన్న పాము అతన్ని కాటు వేసినట్లు రైల్వే పోలీసులు..

Indian Railways: రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
Kerala Tamil Nadu Train
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 16, 2024 | 9:17 AM

కొట్టాయం, ఏప్రిల్ 16: ఎండల వేడి తట్టుకోలేక ఓ పాము ట్రైన్‌లో దూరింది. అదే ట్రైన్‌ లో ఉన్న ఓ ప్రయాణికుడిని పాము కాటు వేసింది. దీంతో ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మధురై-గురువాయూర్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కేరళలోని కొట్టాయం పోలీసులు తెలిపారు.

మధురై-గురువాయూర్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ పాము ప్రవేశించి సీటు కింద నక్కింది. అదే ట్రైన్‌లో మధురైకి చెందిన కార్తీక్ అనే ప్రయాణికుడిని అది కాటు వేసింది. దీంతో బాధితుడిని ఎట్టుమనూరు స్టేషన్‌లో దించి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆరో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని పాము కాటు వేసినట్లు తెలుస్తోంది. అదే బోగీలో సీటు కింద ఉన్న పాము అతన్ని కాటు వేసినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో బాధితుడికి పెద్దగా గాయాలేమీ కాలేదని, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సంఘటన సమయలో సీటు కింద పాము కనిపించిందని అదే బోగీలో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా తెలిపారు. ఈ ఘటనతో రైలును ఎట్టుమనూరు స్టేషన్‌లో 10 నిమిషాల పాటు నిలిపి వేశారు. ఆ తర్వాత ట్రైన్‌ యథావిథిగా గమ్యస్థానానికి పరుగులు తీసింది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హనుమకొండ వాసి మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగకు చెందిన బండి రోహిత్‌ రెడ్డి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండి అనిల్‌రెడ్డి, అనితారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రోహిత్‌రెడ్డి అమెరికాలోని టెక్సాస్‌లో అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రోహన్‌రెడ్డి కూడా టెక్సాలో ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో గుండెలవిసేలా రోధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!