Andhra Pradesh: మద్యం మత్తులో కారు డ్రైవర్‌ దారుణం! బైక్‌ను ఢీకొట్టి.. మృతదేహంతో 18 కి.మీ ప్రయాణం

మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దీంతో ఎగిరి కారుపై పడి యువకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించన కారు డ్రైవర్‌ వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. రోడ్డుపై ఇతర వాహనదారులు కారుపై మృతదేహం ఉండటాన్ని గమనించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డు పక్కన ఆపి ఉడాయించారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా..

Andhra Pradesh: మద్యం మత్తులో కారు డ్రైవర్‌ దారుణం! బైక్‌ను ఢీకొట్టి.. మృతదేహంతో 18 కి.మీ ప్రయాణం
Car Driver Hits Bike
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 15, 2024 | 7:19 AM

ఆత్మకూరు, ఏప్రిల్‌ 15: మద్యం మత్తులో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దీంతో ఎగిరి కారుపై పడి యువకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించన కారు డ్రైవర్‌ వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. రోడ్డుపై ఇతర వాహనదారులు కారుపై మృతదేహం ఉండటాన్ని గమనించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డు పక్కన ఆపి ఉడాయించారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో ఆదివారం రాత్రి (ఏప్రిల్ 14) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి (35) ట్రాక్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆత్మకూరు మండలంలోని పి సిద్దరాంపురానికి చెందిన మంజులతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె సంతానం. అనంతపురంలో స్థిరపడిన ఈ దంపతులు ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే అనుకోని ప్రమాదం జరిగడంతో ఈ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడింది. ఆదివారం రాత్రి వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై సిద్దరాంపురంలోని అత్తరింటికి వెళ్లిన ఎర్రిస్వామి రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అనంతపురానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. వై కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రాగానే కళ్యాణదుర్గం వైపు వెళుతున్న ఇన్నోవా కారు ఒక్కసారిగా ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వెళ్లి ఢీ కొట్టింది. దీంతో ఎర్రిస్వామి ఎగిరి కారుపైన పడి మృతి చెందాడు.

అప్పటికే ఫూటుగా మద్యం సేవించి ఉన్న కారు డ్రైవర్‌ ఈ విషయాన్ని గమనించకుండా కారును వేగంగా కళ్యాణదుర్గం వైపు పరుగులు పెట్టించాడు. 15 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారుపై వ్యక్తి పడి ఉండటాన్ని ఇతర వాహనదారులు గమనించి, కారును ఆపి డ్రైవర్‌కు చెప్పారు. దీంతో డ్రైవర్‌ కారును రోడ్డు పక్కన వదిలి పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారు బెంగళూరుకు చెందినదిగా గుర్తించారు. డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్న ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.