Lok Sabha elections 2024 : ‘సెంచరీ కొట్టడమే నా లక్ష్యం..’ ఎన్నికల్లో 98 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి

ఆయనకు ఓటమి కొత్తకాదు. కానీ ఎన్నిసార్లు ఓటమి వెక్కిరించినా అలుపెరుగక గెలుపు కోసం ప్రయత్నించే ఆశాజీవి. ఆయనే హస్నూరామ్‌ అంబేద్కరీ. వయస్సు ప్రస్తుతం 78 ఏళ్లు. ఇప్పటి దాకా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మొదటిసారిగా 1985లో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశాడు. తాజాగా లోక్‌సభ..

Lok Sabha elections 2024 : 'సెంచరీ కొట్టడమే నా లక్ష్యం..' ఎన్నికల్లో 98 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి
Hasnuram Ambedkari
Follow us

|

Updated on: Apr 14, 2024 | 6:00 PM

ఆగ్రా, ఏప్రిల్‌ 14: ఆయనకు ఓటమి కొత్తకాదు. కానీ ఎన్నిసార్లు ఓటమి వెక్కిరించినా అలుపెరుగక గెలుపు కోసం ప్రయత్నించే ఆశాజీవి. ఆయనే హస్నూరామ్‌ అంబేద్కరీ. వయస్సు ప్రస్తుతం 78 ఏళ్లు. ఇప్పటి దాకా 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. మొదటిసారిగా 1985లో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశాడు. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పోటీకి సిద్ధమయ్యాడు. ఈ సారి రెండు స్థానాల నుంచి బరిలో దిగాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖేరాఘర్‌కు చెందిన హస్నూరామ్‌ అంబేద్కరీ ఎన్నికల్లో పోటీ చేయడంలో సెంచరీ కొట్టాకే అస్త్ర సన్యాసం చేస్తానని అంటున్నాడు. తాను 100 సార్లు పోటీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నాడు. ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ పోటీచేయడట. అదేంటీ అనుకుంటున్నారా? అయితే మీరు హస్నూరామ్‌ అంబేద్కరీ కథ తెలుసుకోవాల్సిందే..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖేరాఘర్‌ నియోజక వర్గం నుంచి అంబేద్కరీ 1985 మార్చిలో మొదటిసారి బహుజన్ సమాజ్‌వాది పార్టీ (BSP) అభ్యర్ధిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలా గ్రామ పంచాయతీ, రాష్ట్ర అసెంబ్లీ, ఎమ్మెల్సీ, ఎంపీ.. ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు. చివరికి భారత రాష్ట్రపతి పదవికి కూడా తాను దాఖలు చేశానని, అయితే అది తిరస్కరించబడిందని పేర్కొన్నాడు. తన జీవిత కాలంలో 300 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిన అంబేద్కరీ.. అసలు తానెందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడో తాజాగా వివరించారు.1984 ఏడాది చివరల్లో ఆగ్రా తహసీల్‌లో ‘అమీన్’ పదవికి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడని, BSP టికెట్ ఇస్తుందని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత బీఎస్పీ టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. నీ భార్యే నీకు ఓటేయదు.. ఇతరులు నీకెలా ఓటేస్తారంటూ అవమానించాకరట. ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకే ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, ప్రజల నుంచి కూడా ఓట్లు రాబట్టగలనని నిరూపించుకునేందుకే మరిన్ని సార్లు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నట్లు అంబేద్కరీ పేర్కొన్నారు.

అంబేద్కరీ తాను డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అనుచరుడినని, 1977 నుంచి 1985 వరకు బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)లో చురుకుగా పనిచేసినట్లు తెలిపారు. సోమవారం రెండు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తానని, నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓట్ల కోసం ప్రచారం సాగాస్తానని అంబేద్కరీ తెలిపారు. అంబేద్కరీకి భార్య శివా దేవి (70), ఐదుగురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల మద్ధతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను వ్యక్తిగతంగా వెళ్లి తన మద్దతుదారులను కలుసుకుని ఎన్నికల్లో తనకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నానని, నేను భౌతికంగా సంప్రదించలేని వారికి ఓటు వేయమని చేతితో రాసిన పోస్ట్‌కార్డ్‌లను పంపుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
పిల్లలకు గోధుమపిండి అంటే అలెర్జీనా.. బీ అలర్ట్..
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో సుహాస్ లేటెస్ట్ హిట్ 'ప్రసన్న వదనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
స్నానం చేసే బకెట్‌లో వీటిని కలపండి.. ఆ ప్రాబ్లమ్స్‌ అన్నీ మాయం!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
మీన రాశిలో కుజుడు..ఆ రాశుల వారికి రాజ యోగాలు.. దోషాలు కూడా!
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై.. సచిన్ కుమారుడు వచ్చేశాడు
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
రోజుని మష్రూమ్ కాఫీతో ప్రారంభించండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
దోసకాయ తొక్క.. పనికిరాదని పారేయకండి.. లాభాలు తెలిస్తే అవాక్కే!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వింత వాతావరణం..!
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
మేష రాశిలో బుధుడు..ఆ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!
వ్యాక్సిన్లపై సంచలనం రేపుతున్న పరిశోధనలు!