Heat wave and Heart Attack: వేసవిలో పొంచి ఉన్న హార్ట్ ఎటాక్ రిస్క్.. ఈ లక్షణాలు కన్పిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హీట్ స్ట్రోక్ అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒక్కోసారి దీనివల్ల గుండెపోటు కూడా సంభవిస్తుంది. అందుకే వేసవిలో మీ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగుతున్న వేడి వల్ల శరీరంలో నీటి కొరత తలెత్తుతుంది. దీని కారణంగా శరీర విధులు పలు రకాలుగా ప్రభావితమవుతాయి. అందులో గుండెపోటు ప్రమాదం కూడా ఉంది. ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, ఆ ప్రదేశంలో ఉండే వారికి హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉంటుంది..
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హీట్ స్ట్రోక్ అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఒక్కోసారి దీనివల్ల గుండెపోటు కూడా సంభవిస్తుంది. అందుకే వేసవిలో మీ శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. పెరుగుతున్న వేడి వల్ల శరీరంలో నీటి కొరత తలెత్తుతుంది. దీని కారణంగా శరీర విధులు పలు రకాలుగా ప్రభావితమవుతాయి. అందులో గుండెపోటు ప్రమాదం కూడా ఉంది. ఏదైనా ప్రాంతంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే, ఆ ప్రదేశంలో ఉండే వారికి హీట్ స్ట్రోక్ ప్రమాదం పొంచి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో హీట్ స్ట్రోక్ లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. హీట్ స్ట్రోక్ సమయంలో శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఆ వివరాలు తెలుసుకుందాం..
హీట్ స్ట్రోక్ – లక్షణాలు
అలసట
ఇది గుండెపోటు ప్రారంభ లక్షణం. కొంతమంది వేసవిలో త్వరగా అలసిపోతుంటారు. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఉండదు. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. వేసవిలో అకస్మాత్తుగా మూర్ఛపోతే.. ఇది కూడా గుండెపోటుకు సంకేతంగా భావించాలి. అందువల్ల దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
తలనొప్పి
సూర్యరశ్మి కారణంగా నిత్యం తలనొప్పి వస్తుంటే బీపీ పెరిగే ప్రమాదం ఉంది. సకాలంలో బీపీకి చికిత్స అందించకపోతే గుండెపోటు రావచ్చు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బులకు కారణం కావచ్చు.
హీట్ స్ట్రోక్ వల్ల గుండెపోటు ఎలా వస్తుంది?
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న డాక్టర్ అజిత్ జైన్ ఏం చెబుతున్నారంటే.. హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటు సంభవిస్తుంది. పెరుగుతున్న వేడి కారణంగా శరీరం తన ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ప్రయత్నిస్తుంది. దీనివల్ల గుండెకు ఎక్కువ రక్త ప్రసరణ పంప్ చేయాలి. ఈ సమయంలో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల గుండె కొట్టుకోవడం వేగం అవుతుంది. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. చాలా గంటలు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ తగిలి చాలా మంది మృత్యువాత పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి మరణాలకు ప్రధాన కారణాలు గుండెపోటు, గుండె వైఫల్యం.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు హీట్ స్ట్రోక్ కారణంగా గుండెపోటుకు గురవుతారని డాక్టర్ జైన్ వివరిస్తున్నారు. అలాంటి వారు విపరీతమైన వేడిలో బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా ఈ కింది నివారణ పద్ధతులను పాటించాలి.
- రోజుకు 7-8 గ్లాసుల నీరు త్రాగాలి
- నిమ్మ నీళ్లు తాగాలి
- అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి
- ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి
- వదులైన బట్టలు ధరించాలి
- సూర్యకాంతి నేరుగా తగల కుండా గొడుగు లేదా స్కార్ఫ్ ధరించాలి
వీటిల్లో మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.