Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishi Sunak: ‘ప్చ్‌.. డ్రెస్సింగ్‌ ఇలాగేనా చేసుకునేది! ఆ బూట్లు..’ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నెటిజన్ల ఫైర్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (43)పై ఫ్యాషన్ ప్రియలు విరుచుకు పడుతున్నారు. ఒక దేశ ప్రధాని అయ్యుండి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి దుస్తులు, బూట్లు ధరిస్తారా? అంటూ మండిపడుతున్నారు. అసలు సంగతేమంటే.. యూకే ప్రధాని రిషి సునక్‌ ఇటీవల 10 డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ్కి ఆయన తెలుపు షర్ట్‌, నీలం రంగు ప్యాంట్‌ కాంబినేషన్‌లో అడిడాస్‌ సంస్థకు..

Rishi Sunak: 'ప్చ్‌.. డ్రెస్సింగ్‌ ఇలాగేనా చేసుకునేది! ఆ బూట్లు..' బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నెటిజన్ల ఫైర్
Rishi Sunak
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 11, 2024 | 7:11 PM

లండన్‌, ఏప్రిల్ 11: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (43)పై ఫ్యాషన్ ప్రియలు విరుచుకు పడుతున్నారు. ఒక దేశ ప్రధాని అయ్యుండి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి దుస్తులు, బూట్లు ధరిస్తారా? అంటూ మండిపడుతున్నారు. అసలు సంగతేమంటే.. యూకే ప్రధాని రిషి సునక్‌ ఇటీవల 10 డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ్కి ఆయన తెలుపు షర్ట్‌, నీలం రంగు ప్యాంట్‌ కాంబినేషన్‌లో అడిడాస్‌ సంస్థకు చెందిన వైట్ సాంబా స్నీకర్స్‌ను సునాక్‌ ధరించారు. తెలుపు-బూడిద రంగు స్పీకర్స్‌, బ్లాక్‌ సాక్స్‌ ధరించి కనిపించారు. ఇది ఫ్యాషన్ ప్రేమికులను తీవ్రంగా హర్ట్‌ చేసింది.

ఈ షూకి ప్రత్యేక ట్రెండ్ ఉంటుందని, దానిని ఆయన ముక్కలు చేశారని, ఆయన డ్రెస్సింగ్‌కు అస్సలు మ్యాచ్‌ కాలేందంటూ వారంతా సోషల్‌ మీడియాలో కామెంట్లు పెట్టసాగారు. ఎంతో పేరుగాంచిన లెజెండరీ అడిడాస్ సాంబాస్‌ షూ ఏ మాత్రం మ్యాచ్‌కాకుండా ఇలా ధరించారేంటీ అంటూ విమర్శిస్తున్నారు. సునక్ ట్రెండీగా కనిపించడానికి ప్రయత్నించడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ పెదవి విరుస్తు తమ వ్యతిరేకతను తెలియజేశారు. నెటిజన్ల స్పందనకు ఆయన స్పందించాల్సి వచ్చింది. అందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. తాను కూడా ఎన్నో యేళ్లుగా అడిడాస్‌ షూ అభిమానినంటూ చెప్పుకొచ్చాడు.

‘‘సాంబా కమ్యునిటీ లవర్స్‌కు క్షమాపణలు చెప్తున్నాను. సాంబాతో పాటు అడిడాస్ కంపెనీకి చెందిన ఇతర మోడళ్లను ఎన్నోఏళ్లుగా ధరిస్తున్నాను. క్రిస్మస్‌ కానుకగా మొదటిసారి నా సోదరుడు ఆ కంపెనీ బూట్లను ఇచ్చాడు. అప్పటినుంచి అడిడాస్ ప్రొడక్ట్స్‌కి అభిమానిగా మారిపోయాను. ఇంటర్వ్యూ వీడియోలో కనిపించిన అడిడాస్ స్నీకర్ల జతను నేనే కొన్నాను. చాలా కాలంగా ఈ సంస్థ ఉత్పత్తులను నేను వినియోగిస్తున్నాను’ అంటూ ఆయన వివరణ ఇచ్చారు. అయితే తన ఆహార్యంపై, తాను ధరించిన దుస్తులపై ఇతరుల ఫోకస్ ఈ రేంజ్‌లో ఉండటం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటూ నవ్వేశారు. ఏమాటకామాట చెప్పుకోవాలి.. రిషీ సునాక్‌ నిజంగానే స్మార్ట్‌గా ఉంటారు. అందుకే అందరూ ఆయన డ్రెస్సింగ్‌ను మరీ ఇంతగా పట్టిపట్టి గమనిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.