AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Youngest Billionaire: యంగెస్ట్ లచ్చిందేవి..! ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న 19 యేళ్ల యువతి

ప్రతీయేట ప్రపంచ కుబేరుల జావితా విడుదల చేస్తుంటారు. 2024 ఏడాదికి సంబంధించి తాజాగా ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా విడుదలైంది. అయితే ఈసారి ప్రపంచ కుబేరుల జాబితాలో టీనేజ్‌ వయసున్న ఓ స్టూడెంట్‌ చేరి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె..19 యేళ్ల బ్రెజిలియన్ విద్యార్థిని లివియా వోయిగ్ట్. లివియా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా రికార్డు సృష్టించింది. 2024 ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో..

World's Youngest Billionaire: యంగెస్ట్ లచ్చిందేవి..! ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న 19 యేళ్ల యువతి
World's Youngest Billionaire
Srilakshmi C
|

Updated on: Apr 10, 2024 | 5:58 PM

Share

బ్రెజిల్‌, ఏప్రిల్ 10: ప్రతీయేట ప్రపంచ కుబేరుల జావితా విడుదల చేస్తుంటారు. 2024 ఏడాదికి సంబంధించి తాజాగా ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా విడుదలైంది. అయితే ఈసారి ప్రపంచ కుబేరుల జాబితాలో టీనేజ్‌ వయసున్న ఓ స్టూడెంట్‌ చేరి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె..19 యేళ్ల బ్రెజిలియన్ విద్యార్థిని లివియా వోయిగ్ట్. లివియా ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌గా రికార్డు సృష్టించింది. 2024 ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో 33 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న యువ బిలియనీర్లు ఏకంగా 25 మంది ఉన్నారు.

2024 ఫోర్బ్స్‌ బిలియనీర్స్‌ జాబితా ప్రకారం.. బ్రెజిల్‌కు చెందిన 19 ఏండ్ల విద్యార్థిని లివియా వోయిగ్ట్‌ ప్రపంచంలో అత్యంత పిన్న వయస్కురాలైన బిలియనీర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. లివియా నికర ఆదాయం విలువ 1.1 బిలియన్‌ డాలర్లు. వయసులో తన కన్నా రెండు నెలలు పెద్దయిన క్లెమెంట్‌ డెల్‌ వెచియోను అధిగమించి ఈ స్థానాన్ని లివియా సొంతం చేసుకుంది. లాటిన్‌ అమెరికాలోని అమెరికాలో అతిపెద్ద ఎలక్ట్రికల్ మోటార్‌ల తయారీదారు వెగ్‌ (WEG)సంస్థలో లివియా అతిపెద్ద వాటాదారుగా ఉంది. ఈ కంపెనీని ఆమె తాత వెర్నర్ రికార్డో వోయిగ్ట్, దివంగత బిలియనీర్లు ఎగ్గాన్ జోవో డా సిల్వా, గెరాల్డో వెర్నింగ్‌హాస్‌లతో కలిసి సంయుక్తంగా స్థాపించారు. అయితే వెగ్‌ బోర్డులో ఆమె ఇంకా ఎగ్జిక్యూటివ్ హోదాలో సభ్యత్వం పొందలేదు. వెగ్‌ కంపెనీ 10కిపైగా దేశాల్లో బ్రాంచ్‌లు కలిగి ఉంది. 2022లో వెగ్‌ సంస్థ సుమారు 6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందింది.

కాగా లివియా ప్రస్తుతం బ్రెజిల్‌లోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తోంది. 2024లో అత్యంత చిన్న వయస్కులైన తొలి ఏడుగురు బిలియనీర్‌ లిస్ట్‌లో లివియా అక్క డోరా వోయిగ్ట్‌ డి అస్సిస్‌ కూడా ఉండటం విశేషం. 26 ఏళ్ల డోరా 2020లో ఆర్కిటెక్చర్ డిగ్రీని పొందారు. వీరేకాకుండా ఇటీవల కాలంలో అనేక మంది యువత యవ బిలియనీర్లు జాబితాలో చేరుతున్నారు. 25 – 27 సంవత్సరాల వయస్సు గల ఐర్లాండ్ మిస్త్రీ సోదరులు 2022లో వారి తండ్రి మరణించిన తర్వాత ముంబైకి చెందిన టాటా సన్స్ కంపెనీ ద్వారా అత్యధిక మొత్తంలో సంపదను పొందారు. ప్రస్తుతం వారి నికర విలువ 4.9 బిలియన్‌ డాలర్లుగా అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే