Suicide Attempt at Makkah: మక్కాలో షాకింగ్‌ ఘటన.. మసీదుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం! భద్రత పెంపు..

సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్‌ ముస్లీంలకు అత్యంత పవిత్ర స్థలం. జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఇటువంటి పవిత్ర స్థలంలో తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మక్కా మస్జిద్-అల్-హరామ్ పై అంతస్తు నుండి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. ఈ ఘటనను మసీదులో జరిగిన ఆత్మహత్య ఘటనగా భావిస్తున్నారు. అయితే మసీదు భద్రత దృష్ట్యా సదరు వ్యక్తి గుర్తింపు, జాతీయతను బహిర్గతం..

Suicide Attempt at Makkah: మక్కాలో షాకింగ్‌ ఘటన.. మసీదుపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం! భద్రత పెంపు..
Suicide Attempt At Makkah
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 09, 2024 | 4:46 PM

సౌదీ, ఏప్రిల్ 9: సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్‌ ముస్లీంలకు అత్యంత పవిత్ర స్థలం. జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్లాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఇటువంటి పవిత్ర స్థలంలో తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మక్కా మస్జిద్-అల్-హరామ్ పై అంతస్తు నుండి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. ఈ ఘటనను మసీదులో జరిగిన ఆత్మహత్య ఘటనగా భావిస్తున్నారు. అయితే మసీదు భద్రత దృష్ట్యా సదరు వ్యక్తి గుర్తింపు, జాతీయతను బహిర్గతం చేయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మక్కాలోని మసీదు అల్ హరామ్ భద్రత కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది.

ముస్లీం పవిత్ర స్థలమైన మక్కా మసీదులో ఆత్మహత్యాయత్నం జరగడం ఇదేం తొలిసారి కాదు. 2017లో మసీదు ప్రాంగణం మధ్యలో ఉన్న చతురస్రాకారపు రాతి భవనం – కాబా ముందు ఓ సౌదీ వ్యక్తి తన దేహానికి నిప్పంటించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే భద్రతా బలగాలు గమనించి నిరోధించడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారు. ఇక 2018లో మసీదులో మూడు వేర్వేరు ఆత్మహత్యాయత్నాలు జరిగాయి. జూన్ 2018 లో ఒక ఫ్రెంచ్ వ్యక్తి మసీదు పైకప్పు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత బంగ్లాదేశ్‌కు చెందిన మరో వ్యక్తి కూడా అదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. భక్తులు పవిత్ర స్థలంలో ప్రదక్షిణలు చేస్తుండగా ఆ వ్యక్తి పైకప్పుపై నుంచి కిందకి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ ఘటనలో సూడాన్‌కు చెందిన ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన భక్తుల్లో తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఆగస్టు 2018లో ఓ అరబ్ వ్యక్తి కూడా ఇదే విధంగా మక్కాపై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.