Senior Actress Sarada: సీనియర్ నటి శారద ఒంటరి జీవితం.. ఆమె శాపమేనా? నటి జీవితంలో అంతులేని ఆవేదన..
ఆమెది ఆరు పదుల సినీ ప్రస్థానం. ఎన్నో అద్భుత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై కొన్ని వందల చిత్రాల్లో అద్భుతంగా రాణించిన ఈ నటి పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విమర్శల పాలయ్యారు. ఆమె ఎవరో కాదు ఊర్వశి శారద. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగారు శారద. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో..
ఆమెది ఆరు పదుల సినీ ప్రస్థానం. ఎన్నో అద్భుత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తెరపై కొన్ని వందల చిత్రాల్లో అద్భుతంగా రాణించిన ఈ నటి పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విమర్శల పాలయ్యారు. ఆమె ఎవరో కాదు ఊర్వశి శారద. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ వెలుగు వెలిగారు శారద. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. శారద వ్యక్తిగత జీవితం విషయానికొస్తే..
శారద అసలు పేరు సరస్వతి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు శారదగా మారింది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1945 జూన్ 25న శారద జన్మించారు. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీ దేవి. వీరిది వ్యవసాయ కుటుంబం. శారదకి మోహనరావు అనే సోదరుడు ఉన్నాడు. చిన్నతనంలో చెన్నైలో అమ్మమ్మ వద్ద శారద పెరిగారు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. ఆరేళ్ల వయసు నుంచే శారద నటన ఆరంభించారు. 1955లో వచ్చిన ‘కన్యా శుల్కం’లో ఆమె తొలిసారి నటించారు. అందులో ఆమె పాత్ర చాలా చిన్నది. 1961లో వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమాతో శారద గుర్తింపు దక్కింది. అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్న సమయంలోనే శారదకు నటుడు చలంతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే చలం పెళ్లి చేసుకున్న తర్వాత శారద జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నటుడిగా చలం కెరీర్ పతనమైన సమయంలో శారద హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నారు. అయితే డబ్బు కారణంగా చలం-శారదల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇదంతా చలం మొదటి భార్య శాపఫలితం అని కొందరు అంటుంటారు.
ఎందుకంటే చలం కెరియర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారద కంటే ముందే రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ ప్రేమకు గుర్తుగా ఆమె పేరులోని ‘రమణ’ను తన పేరులో చేర్చుకుని తన పేరును రమణా చలంగా మార్చుకున్నారు. అంతగా ప్రేమించిన భార్యను చలం.. శారద కోసం మోసం చేశాడని అందరూ అనుకుంటారు. వీరి ప్రేమను ఒప్పుకోలేక రమణకుమారి ఆత్మహత్య చేసుకుని కన్ను మూసిందట. ఈ పాప ఫలితమే శారద వైవాహిక జీవితంపై కూడా పడిందని అప్పట్లో అనేక మంది గుసగుసలాడుకున్నారు. కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి పోగొట్టుకుని.. చలం పూర్తిగా మందుకు బానిస అయ్యాడు. తర్వాత శారద-చలం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 1984లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపించి అతని నుంచి విడిపోయింది. మొదటి భార్యతో కలిసి ఉంటే చలం దీనస్థితికి వచ్చేవాడు కాదని కొందరు అంటుంటారు. శారద కూడా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉండేది. కానీ వీరి ప్రేమ వల్ల ఓ నిండు జీవితం బలైపోవడమేకాకుండా.. ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా అదీ ఎక్కువకాలం నిలవ లేదు. పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో శారద కలిసి ఉంటున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.