Prabhas: ప్రభాస్‌తో సినిమా మాములుగా ఉండదు.. ఫస్ట్ రోజే రూ.150 కోట్లు పక్కా: డైరెక్టర్ సందీప్ రెడ్డి
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 'అర్జున్‌రెడ్డి', 'కబీర్‌సింగ్', 'యానిమల్' చిత్రాల విజయాలతో సందీప్ రెడ్డి వంగాకు డిమాండ్ బాగా పెరిగింది. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్’, ‘యానిమల్’ చిత్రాల విజయాలతో సందీప్ రెడ్డి వంగాకు డిమాండ్ బాగా పెరిగింది. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారు. అలాగే సందీప్ ను నమ్మి వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు . ఆ సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. మూడు సూపర్ హిట్స్ తర్వాత సందీప్ చేస్తోన్న సినిమా కావడంతో స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తో చేతులు కలిపినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ పెరిగింది. తాజాగా ప్రభాస్ తో సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు సందీప్ రెడ్డి. అదే విధంగా ‘స్పిరిట్’ సినిమా తొలిరోజు ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా అప్పుడే అంచనా వేశాడు.
సినిమా బడ్జెట్ గమనిస్తే నిర్మాత ఆల్రెడీ సేఫ్ అయిపోయాడు. నాకు, ప్రభాస్‌లకు ఉన్న మార్కెట్ దృష్ట్యా సినిమా బడ్జెట్ శాటిలైట్, డిజిటల్ ప్రసార హక్కుల నుంచి రికవరీ అవుతుంది. టీజర్, ట్రైలర్, పాటలు, ప్రీ రిలీజ్ ఇలా అన్ని అంశాలు చూస్తే.. ప్రభాస్ స్పిరిట్ సినిమా తొలిరోజే 150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంది. ఇది ట్రేడ్ లెక్క’ అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. కాగా గతంలో ప్రభాస్ కోసం ఓ హాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సందీప్ రెడ్డి వంగకు ఆఫర్ వచ్చిందట. కానీ ఆ సినిమా కథ నచ్చక సందీప్ ఆ అవకాశాన్ని తిరస్కరించాడట. ఆ తర్వాత స్పిరిట్ సినిమా కథ చెప్పడం, అది ప్రభాస్‌కి నచ్చడం చకా చకా జరిగిపోయాయట. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ లేదా డిసెంబర్‌లో స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కల్కి సినిమా షూటింగ్ లో ప్రభాస్..
Italy photo dump.. @Kalki2898AD 🌸 it was 🥶 💨 ✨🏝️ pic.twitter.com/Rhi514vaqu
— Disha Patani (@DishPatani) April 5, 2024
Italy photo dump.. @Kalki2898AD 🌸 it was 🥶 💨 ✨🏝️ pic.twitter.com/Rhi514vaqu
— Disha Patani (@DishPatani) April 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి