AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani: కియారా దెబ్బకు వాటి సేల్స్ బాగా పెరిగాయట.. గూగుల్‌లో కూడా గట్టిగానే గాలించారట

ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అంతే కాదు పలు యాడ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సేల్స్ పెంచుకోవడానికి చాలా బ్రాండ్లు ఆమెతో టై అప్ అయ్యాయి. కియారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంది. అయితే కియారా ప్రమోట్ చేయకుండానే పరికరం డిమాండ్ భారీగా పెరిగిందట.

Kiara Advani: కియారా దెబ్బకు వాటి సేల్స్ బాగా పెరిగాయట.. గూగుల్‌లో కూడా గట్టిగానే గాలించారట
Kiara Advani
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2024 | 6:04 PM

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అంతే కాదు పలు యాడ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సేల్స్ పెంచుకోవడానికి చాలా బ్రాండ్లు ఆమెతో టై అప్ అయ్యాయి. కియారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంది. అయితే కియారా ప్రమోట్ చేయకుండానే పరికరం డిమాండ్ భారీగా పెరిగిందట. అంతే కాదు దాని వాడకం కూడా భారీగా పెరిగిపోయిందట.  దీనిపై కరణ్ జోహార్ యాజమాన్యంలోని ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మాత సోమన్ మిశ్రా మాట్లాడారు.

‘లస్ట్ స్టోరీస్’ చిత్రం 15 జూన్ 2018న విడుదలైంది. విభిన్నమైన కథలను కలిపి ఓ సినిమా తీశారు. ఈ చిత్రంలో లైంగిక నేపథ్యాలు ఉన్నాయి. ఈ సినిమాలో విక్కీ కౌశల్, కియారా అద్వానీ కలిసి నటించారు. కియారా తన భర్త లైంగికంగా సంతృప్తి చెందని మహిళగా కనిపించింది. ఈ కారణంగా, హీరోయిన్ సెక్స్ టాయ్ ను ఉపయోగిస్తుంది. ఈ సీన్ వైరల్‌గా మారింది. సినిమాకు ఇదే సీన్ వల్ల మంచి స్పందన వచ్చింది.అంతే కాదు కియారాకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది.

ఈ సినిమా ఎఫెక్ట్స్ గురించి సోమన్ మిశ్రా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..  ఈ సినిమా విడుదలైన తర్వాత సెక్స్‌టాయ్‌ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. ‘ఆ సినిమా సీన్ వైరల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీంతో సెక్స్ టాయ్స్ విక్రయాలు పెరిగాయి.  గూగుల్‌లో కియారా అద్వానీ వైబ్రేటర్, కియారా అద్వానీ సెక్స్ టాయ్‌లు అంటూ సెర్చ్ చేస్తున్నారు’ అని సోమన్ అన్నారు.

కియారా కంటే ముందు కృతి సనన్‌కి ఆ పాత్ర దక్కింది. అయితే ఈ పాత్ర చేయడానికి ఆమె అంగీకరించలేదు. ఈ సినిమా స్క్రిప్టు చూసి, సినిమా కథ విన్న తర్వాత ఈ పాత్ర చేయకూడదని మా అమ్మ చెప్పింది. మా అమ్మకు వ్యతిరేకంగా సినిమా చేయాలనుకోలేదు అని కృతి సనన్ తెలిపింది. గతంలో కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో కృతి సనన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ‘లస్ట్ స్టోరీస్’ సినిమాతో కియారా అద్వానీకి మంచి పేరు వచ్చింది. కొందరు ఆమెను ట్రోల్ కూడా చేశారు. దీని తర్వాత ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రాల్లో నటిస్తుంది. కియారా సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..

పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
పాక్‌తో యుద్ధం వస్తే.. ఇండియాలో ఈ ప్లేస్‌లు ఎంతో సేఫ్‌!
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఉదయాన్నే అరచేతులు రుద్దుకుంటే ఇన్ని బెనిఫిట్సా..?
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు వేసవిలో కూడా హ్యాపీగా ఉంటారు
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
కారులో వచ్చిన సీఐ సార్.. కులాసాగా కిరాణా సరుకులు కట్టమన్నాడు..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
టీ ప్రియులా.. మీరు ఎప్పుడైనా కొబ్బరి నీళ్ల టీ తాగారా..
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
వారికి నెల రోజుల సమ్మర్‌ సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
ప్రతి చిన్న విషయానికి కోపంతో రగిలిపోతున్నారా..? వామ్మో..
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
పదవీ విరమణ పొందిన అబ్దుల్‌ అజీమ్‌కు ఘన సన్మానం
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
May 2025 Horoscope: వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరిగే ఛాన్స్..
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత
సముద్ర మథనంలో లక్ష్మీదేవి సహా ఉద్భవించిన వస్తువులుఇవే ప్రాముఖ్యత