MI vs DC, IPL 2024: 4,6,6,6,4,6.. 20 ఓవర్‌లో ఏకంగా 32 రన్స్.. ముంబై ప్లేయర్ విధ్వంసం.. వీడియో చూశారా?

Mumbai Indians vs Delhi Capitals : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమేరియా షెపర్డ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విరుచుకుపడ్డాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో రొమేరియా షెపర్డ్ ఏకంగా 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు

MI vs DC, IPL 2024: 4,6,6,6,4,6.. 20 ఓవర్‌లో ఏకంగా 32 రన్స్.. ముంబై ప్లేయర్ విధ్వంసం.. వీడియో చూశారా?
Romario Shepherd
Follow us
Basha Shek

|

Updated on: Apr 07, 2024 | 8:23 PM

Mumbai Indians vs Delhi Capitals : ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమేరియా షెపర్డ్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విరుచుకుపడ్డాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో రొమేరియా షెపర్డ్ ఏకంగా 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఢిల్లీ స్టార్ బౌలర్ నోకియా వేసిన ఈ ఆఖరి ఓవర్‌లో షెపర్డ్ ఏకంగా 4 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. ఆసక్తికరంగా, రొమేరో వరుసగా 3 సిక్సర్లు కొట్టడం విశేషం. ఈ మేరకు విండీస్ వీరుడి విధ్వంసం వీడియోను ఐపీఎల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎన్రిచ్ నోకియా 20వ ఓవర్ బౌల్ చేశాడు. ఈ ఓవర్ మొదటి, ఐదో బంతులను బౌండరీలు బాదిన షెపర్డ్ మిగిలిన 4 బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 390 స్ట్రైక్ రేట్ తో అజేయంగా 39 పరుగులు చేశాడు రొమేరియా. ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఆ తర్వాత ఢిల్లీని 205 పరుగులకే కట్టడి చేసి 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ,  జస్ప్రీత్ బుమ్రా.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI:

రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, జే రిచర్డ్‌సన్, ఎన్రిక్ నార్ట్జే, ఇషాంత్ శర్మ,  ఖలీల్ అహ్మద్.

ఆఖరి ఓవర్ లో రొమారియో షెపర్డ్ విధ్వంసం.. ఏకంగా 32 పరుగులు.. వీడియో ఇదిగో..

హిట్ మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్.. వీడియో ఇదుగో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..