RR vs RCB, IPL 2024: కింగ్ కోహ్లీ ‘కిర్రాక్’ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. రికార్డ్ సెంచరీతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఐపీఎల్ టోర్నీ 19వ మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. రికార్డ్ సెంచరీతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఐపీఎల్ టోర్నీ 19వ మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ శుభారంభం అందించారు. పవర్ ప్లేలో ఇద్దరూ కలిసి 53 పరుగులు చేశారు. దీంతో జట్టుకు మంచి శుభారంభం దక్కింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో యుజ్వేంద్ర చాహల్ సఫలమయ్యాడు. చాహల్ బౌలింగ్‌లో పాఫ్ ఇచ్చిన క్యాచ్ ను ట్రెంట్ బౌల్ట్ వదిలేశాడు. కానీ రెండో బంతికే చాహల్ మళ్లీ విజయం సాధించాడు. క్యాచ్ పట్టడంలో బట్లర్ ఎలాంటి తప్పు చేయలేదు. ఫాఫ్ డు ప్లెసిస్ 33 బంతుల్లో 44 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లోనూ గ్లెన్ మ్యాక్స్‌వెల్ నిరాశపర్చాడు. అతను 3 బంతుల్లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆండ్రీ బెర్గ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడు. సౌరభ్ కూడా 6 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఆర్సీబీ స్కోరు వేగం బాగా మందగించింది. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ రెండు, ఆండ్రీ బెర్గర్ ఒక వికెట్ తీసుకున్నారు.
కింగ్ కోహ్లీ సెంచరీ..
“I’ve still got it, I guess.” ❤️#RRvRCB #TATAIPL #IPLonJioCinema #ViratKohli pic.twitter.com/XdO7AmVq5l
— JioCinema (@JioCinema) April 6, 2024
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోపుల్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
Kohli ko 𝒑𝒂𝒄𝒆 pasand hai 👑
Watch all the action from #RRvRCB LIVE in Kannada and 11 languages with #IPLonJioCinema 📲#TATAIPL pic.twitter.com/zQ2HMDq6bM
— JioCinema (@JioCinema) April 6, 2024
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నంద్రా బర్గర్, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








