IPL 2024: హైదరాబాద్‌లో చెన్నై ప్లేయర్లు.. బిర్యానీ పార్టీతో ఆతిథ్యమిచ్చిన అంబటి రాయుడు.. వీడియో చూశారా?

తాజాగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు భాగ్య నగరానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు కూడా ఇదే చేశారు. ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీని ఆరగించారు. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు వారికి ఈ బిర్యానీని రుచి చూపించాడు.

IPL 2024: హైదరాబాద్‌లో చెన్నై ప్లేయర్లు.. బిర్యానీ పార్టీతో ఆతిథ్యమిచ్చిన అంబటి రాయుడు.. వీడియో చూశారా?
Chennai Super Kings
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:30 PM

సాధారణంగా హైదరాబాద్ అంటే ఇక్కడి ఘుమఘుమలాడే బిర్యానీ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఇక్కడి బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అందుకే విదేశీయులు సైతం హైదరాబాద్ కు వస్తే బిర్యానీని టేస్ట్ చేయకుండా వదిలి పెట్టరు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు భాగ్య నగరానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు కూడా ఇదే చేశారు. ఘుమఘుమలాడే హైదరాబాద్ బిర్యానీని ఆరగించారు. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై మాజీ ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు వారికి ఈ బిర్యానీని రుచి చూపించాడు. రవీంద్ర జడేజా, అజింక్యా రహానే, దీపక్ చాహర్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ చౌదరి తదితర చెన్నై ప్లేయర్లంతా రాయుడు బిర్యానీ పార్టీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది సీఎస్కే. ‘ఇది బిర్యానీ టైమ్. Biryani Super Kudumbam’ అని తమ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ దర్శనీయ స్థలాలను చుట్టేశారు సీఎస్కే ప్లేయర్లు. చార్మినార్, ట్యాంక్ బండ్ తదితర ప్రదేశాలకు వెళ్లి సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం వీటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. కాగా శుక్రవారం (ఏప్రిల్06) రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే రెండు జట్లు హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. కాగా ఈ సీజన్ లో చెన్నై వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో విజయం సాధించింది. ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే.. ఆడిన మూడింట్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది.

ఇవి కూడా చదవండి

బిర్యానీ పార్టీలో చెన్నై క్రికెటర్లు..

అంబటి రాయుడు తో సీఎస్కే ప్లేయర్లు..

హైదరాబాద్ దగ్గర ఫొటోలు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles