GT vs PBKS, IPL 2024: అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ అదరగొట్టాడు. గత మ్యాచుల్లో పెద్గగా ఆకట్టుకోని ఈ టీమిండియా ప్రిన్స్ సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ కేవలం 48 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు.

GT vs PBKS, IPL 2024: అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
Shubman Gill
Follow us

|

Updated on: Apr 04, 2024 | 9:53 PM

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ అదరగొట్టాడు. గత మ్యాచుల్లో పెద్గగా ఆకట్టుకోని ఈ టీమిండియా ప్రిన్స్ సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ కేవలం 48 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 89 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కాగా ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.  ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 11 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ 26 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో కేన్ 4 ఫోర్లు కొట్టాడు. సాయి సుదర్శన్ 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 8 పరుగులు చేసి వెనుదిరిగాడు. రాహుల్ తెవాటియా 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధికంగా కగిసో రబడా  2 వికెట్లు తీశాడు. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే మ్యాచ్ లో గుజరాత్ తరఫున ఓ అరుదైన ఘనత అందుకున్నాడు గిల్. ఆ జట్టు తరఫున 1500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ -XI)

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.

ఇంపాక్ట్ ప్లేయర్:

BR శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ -XI)

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.

ఇంపాక్ట్ ప్లేయర్:

తాన్య త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవీరప్ప

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..