DC vs KKR, IPL 2024: రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ వృథా.. ఢిల్లీపై కోల్‌కతా ఘన విజయం
ఐపీఎల్ 17 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా ముచ్చటగా మూడో విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. బుధవారం (ఏప్రిల్ 3) రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 17 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా ముచ్చటగా మూడో విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. బుధవారం (ఏప్రిల్ 3) రాత్రి విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కోల్ కతా విధించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పపోరాడింది. కెప్టెన్ రిషభ్ పంత్ (55; 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ (54; 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడారు. అయితే వీరిద్దరూ తప్ప మిగతా బ్యాటర్లెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. దీనికి తోడు లక్ష్యం మరీ ఎక్కవ వకాడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. దీంతో 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఢిల్లీ ఆలౌటై 106 పరుగుల తేడాతో పరాజయం పాలైంది కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 3, మిచెల్ స్టార్క్ 2, సునీల్ నరైన్, రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్ లో విజయంతో కోల్ కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
నరైన్ విధ్వంసం..
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టే ఓపెనర్ సునీల్ నరైన్ చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లు బాది ఢిల్లీ బౌలర్లను తుత్తునీయలు చేశాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ అంగ్రిష్ రఘువంశీ 27 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. రస్సెల్ కూడా దూకుడుగా ఆడి 19 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్( ప్లేయింగ్ -XI)
ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్:
సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, వైభవ్ అరోరా, రహ్మానుల్లా గుర్బాజ్.
ఢిల్లీ క్యాపిటల్స్( ప్లేయింగ్ -XI)
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, రసిఖ్ దార్ సలామ్, రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, సుమిత్ కుమార్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్:
అభిషేక్ పోరెల్, కుమార్ కుషాగ్రా, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..