AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ‘హార్దిక్‌ను తిరిగి గుజరాత్‌కు పంపించండి ప్లీజ్.. అప్పుడే ముంబై గెలుస్తుంది’.. వీడియో వైరల్

సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ముంబై అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చారు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని, ముంబై మొదటి విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ అంతా రివర్స్ అయింది. రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

IPL 2024: 'హార్దిక్‌ను తిరిగి గుజరాత్‌కు పంపించండి ప్లీజ్.. అప్పుడే ముంబై గెలుస్తుంది'.. వీడియో వైరల్
Hardik Pandya
Basha Shek
|

Updated on: Apr 02, 2024 | 8:37 PM

Share

ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. సోమవారం (ఏప్రిల్ 1)న హొం గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ ముంబై చతికిల పడింది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబైకి ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లు బొక్కా బోర్లా పడ్డారు. రోహిత్ శర్మ, నమన్ ధీర్, డెవాల్డ్ బ్రెవిస్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 34 పరుగులు, తిలక్ వర్మ 32 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ 16 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 17 రన్స్ చేశాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో రియాన్ పరాగ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ చేయడంతో రాజస్థాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. తద్వారా రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేసింది. అదే సమయంలో ముంబైకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది.

సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ముంబై అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియంకు తరలివచ్చారు. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని, ముంబై మొదటి విజయం సాధిస్తుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ అంతా రివర్స్ అయింది. రోహిత్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ముంబై విషయంలోనూ అదే జరిగింది. ముంబై ఓటమి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముంబై ఓటమిలో అందరి బాధ్యత ఉంది. అయితే అభిమానులు మాత్రం హార్దిక్‌ ను మళ్లీ టార్గెట్ గా చేసుకున్నారు. రోహిత్‌ని తొలగించి హార్దిక్‌ని కెప్టెన్‌గా చేసినందుకు ఇప్పటికే ముంబై అభిమానులు ఇప్పటికే హార్దిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాంఖడేలో ఓటమితో అభిమానులు మరింత దూకుడు పెంచారు. ‘హార్దిక్‌ని మళ్లీ గుజరాత్‌కి పంపండి’ అని ఓ అభిమాని చెప్పాడు. రోహిత్ ను కెప్టెన్ చేయండి. మళ్లీ ముంబై గెలుపొందడం ప్రారంభిస్తుంది అని ముంబై మద్దతుదారుడు ట్వీట్ చేశాడు. ఇక రకరకాలగా కామెంట్స్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. మరి వీటిపై ఫ్రాంఛైజీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ట్రంప్ ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. త్వరలోనే..
ట్రంప్ ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరల షాక్.. త్వరలోనే..
ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై..
ఎన్నికల ప్రక్రియను అడ్డుకుంటే ఊరుకోం.. బెంగాల్ ఓటర్ల జాబితాపై..
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
చింతచిగురు చేపల పులుసు.. ఇలా చేసి తింటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు!
నిధి కోసం అన్వేషణ.. OTTకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్
నిధి కోసం అన్వేషణ.. OTTకి వచ్చేసిన సరికొత్త అడ్వెంచర్‌ థ్రిల్లర్
డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..
డాక్టర్ అవతారం ఎత్తిన దోపిడి దొంగ.. వైద్యం పేరుతో బంగారం లూటీ..
ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఏకంగా 19 ఏళ్ల యూవీ రికార్డు బద్దలు కొట్టేశాడు.. ఈ ప్లేయర్ ఎవరంటే
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
ఆ సినిమా ప్లాప్ అయ్యాక రాత్రంతా ఏడ్చేసా..
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని సమస్యలను తగ్గిస్తుందంటే...
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..
ఇదేం బాధరా భగవంతుడా.. కడసారి వీడ్కోలుకు కన్నీటి కష్టాలు..