Aadujeevitham OTT: ఓటీటీలోకి ఆడు జీవితం అన్‌ కట్ వెర్షన్.. లాంగ్ రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్.. ఎప్పడు రావొచ్చంటే?

మార్చి 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడు జీవితం రిలీజైంది. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను రీలీజ్ చేయగా.. ఇక్కడ కూడా ఆడియెన్స్ మెప్పు పొందింది. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, ఆహార్యంపై విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి.

Aadujeevitham OTT: ఓటీటీలోకి ఆడు జీవితం అన్‌ కట్ వెర్షన్.. లాంగ్ రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్.. ఎప్పడు రావొచ్చంటే?
Aadujeevitham Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2024 | 10:04 PM

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడు జీవితం..(ది గోట్ లైఫ్). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. బెన్యామిన్ రాసిన ది గోట్ లైఫ్ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 28న మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఆడు జీవితం రిలీజైంది. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నీరాజనాలందుకుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను రీలీజ్ చేయగా.. ఇక్కడ కూడా ఆడియెన్స్ మెప్పు పొందింది. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటన, ఆహార్యంపై విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అతని నటనకు గానూ జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినిమా విశ్లేషకులు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ ఆఖరులో లేదా మే మొదటి వారంలో ఆడు జీవితం సినిమా స్ట్రీమింగ్ కు రానుందన్నమాట.

ఇదిలా ఉంటే ఆడు జీవితం సినిమా రన్ టైమ్ మొత్తం మూడున్నర గంటలు వచ్చిందట. అయితే థియేట్రికల్ వెర్షన్ కోసం బాగా ట్రిమ్ చేసి రిలీజ్ చేశారట మేకర్స్. అయితే ఓటీటీలో మాత్రం మూడున్నర గంటల నిడివితో రిలీజ్ చేయనున్నారట. త్వరలోనే ఆడుజీవితం ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.