DC vs CSK, IPL 2024: సీఎస్కే ప్లేయర్ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి మరీ.. నోరెళ్ల బెట్టిన వార్నర్.. వీడియో
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లోని 13వ మ్యాచ్‌లో ఆదివారం (మార్చి 31) రాత్రి విశాఖపట్నం మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్టు హోరాహొరీగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్ మతీషా పతిరానా ఒంటి చేత్తో పట్టిన అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లోని 13వ మ్యాచ్‌లో ఆదివారం (మార్చి 31) రాత్రి విశాఖపట్నం మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఇరు జట్టు హోరాహొరీగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే పేసర్ మతీషా పతిరానా ఒంటి చేత్తో పట్టిన అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పతిరానా క్యాచ్‌ను ప్రస్తుత ఎడిషన్‌లోనే ‘ఉత్తమ క్యాచ్’గా పేర్కొంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి డేవిడ్ వార్నర్, పృథ్వీ షాలు శుభారంభం అందించారు. . బ్యాటింగ్ పవర్‌ప్లేలో ఇద్దరూ 62 పరుగులు చేయగలిగారు. హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్.. ముస్తాఫిజుర్ వెనుక బంతిని బలంగా కొట్టాడు.. ఈ సమయంలో అక్కడే ఉన్న పతిరానా గాలిలోకి దూసుకెళ్లి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో వార్నర్ తో పాటు గ్రౌండ్ లోని అందరూ ఆశ్చర్యపోయారు. అర్ధ సెంచరీ చేసిన వార్నర్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక మతిష్ పతిరణ క్యాచ్‌ను ఎంఎస్ ధోనీ కూడా అభినందించాడు. చప్పట్లు కొడుతూ అతని దగ్గరికి వెళ్లి హత్తుకున్నాడు. ఇప్పుడు అతని స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులుచేసింది. కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధసెంచరీలతో రాణించారు.
మహేశ్ పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో ఇదిగో..
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩
Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj
— IndianPremierLeague (@IPL) March 31, 2024
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్/కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, ఎన్రిక్ నార్ట్జే, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్):
రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీషా పతిరానా, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..