AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjummel Boys OTT:  ‘ముంజుమెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్‌ అప్పటినుంచే!

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'మంజ్నుమ్మెల్ బాయ్స్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఫిబ్ర‌వ‌రి 22న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Manjummel Boys OTT:  'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్‌ అప్పటినుంచే!
Manjummel Boys Movie
Basha Shek
|

Updated on: Mar 30, 2024 | 7:03 PM

Share

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఫిబ్ర‌వ‌రి 22న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు ‘మంజుమ్మెల్ బాయ్స్’ 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తమిళంలో కూడా విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఏప్రిల్ 4న ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’ సినిమా ఓటీటీలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అయితే అది అబద్ధమని చెబుతున్నారు. ‘మంజుమ్మేల్ బాయ్స్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. . అయితే ఇప్పుడీ సినిమాను ఓటీటీలో ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారనే టాక్ అవాస్తవమని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీనిపై సినీ విశ్లేషకుడు ఏబీ జార్జ్ ట్వీట్ చేశాడు. బహుశా ఈ సినిమా మేలో OTTలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మలయాళం తర్వాత తమిళంలో ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’ సినిమా విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులోకి డబ్ చేసి ఏప్రిల్ 4 నుంచి ఆంధ్ర, తెలంగాణల్లోని ఎంపిక చేసిన నగరాల్లో విడుదల చేస్తున్నారు. ‘పుష్ప’తో పాటు పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయనుంది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నందున సినిమా ఓటీటీ విడుదలను చిత్ర బృందం ఆలస్యం చేస్తోంది.

యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మంజ్నుమ్మెల్ బాయ్స్’. సినిమా కథ విషయానికి వస్తే.. కోడైకెనాల్ లోని ఒక గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహార యాత్ర కు వెళతారు. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోతారు. ఆ యువకుడిని ఆ బృందం ఎలా కాపాడుతుంది, వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ సినిమా కథాంశం.

సూపర్ స్టార్ రజనీకాంత్ తో మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర బృందం..

ఏప్రిల్ 5 న తెలుగులో రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.