Om Bheem Bush: నవ్వేందుకు రెడీగా ఉండండి.. ‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ?.. ఆరోజే రిలీజ్..
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు రెండున్నర గంటలపాటు ప్రేక్షకులకు ఆన్ లిమిటెడ్ కామెడీని అందించి ఎంటర్టైన్ చేయడంలో డైరెక్టర్ శ్రీహార్ష సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అనుకున్నదానికంటే ముందే అంటే విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సినీ ప్రియులను కడుపుబ్బా నవ్వించిన సినిమా ఓం భీమ్ బుష్. హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 22న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాదాపు రెండున్నర గంటలపాటు ప్రేక్షకులకు ఆన్ లిమిటెడ్ కామెడీని అందించి ఎంటర్టైన్ చేయడంలో డైరెక్టర్ శ్రీహార్ష సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అనుకున్నదానికంటే ముందే అంటే విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయనున్నారని టాక్ నడిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రాకంర ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 నుంచే అందుబాటులోకి తీసుకురానున్నారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు.
హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీహార్ష కొనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రాణ స్నేహితులు. వీరిని బ్యాంగ్ బ్రోస్ అని పిలుస్తుంటారు. వీరు ముగ్గురు భైరవపురం అనే ఊరిలో అడుగుపెడతారు. అక్కడ డబ్బులు సంపాదించుకోవడం కోసం సైంటిస్టులుగా కొత్త అవతారం ఎత్తుతారు. దీంతో వీరి గురించి తెలుసుకోవడానికి ఆ ఊరి ప్రజలు వీరికి ఓ పరీక్ష పెడతారు. ఆ ఊరిలో ఉన్న సంపంగి మహల్ లో ఉన్న నిధిని కనిపెట్టాలని ప్రయత్నిస్తున్న వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?.. వీరు ముగ్గురికి ఆ ఊరి ప్రజలు పెట్టిన పరీక్ష ఏంటీ ?.. అనే విషాయలు తెలియాలంటే ఓం బీమ్ బుష్ చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.