Anatomy Of a Fall OTT: ఓటీటీలోకి వచ్చిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ జరిగింది. ఇందులో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. కేవలం అకాడమీ అవార్డ్ మాత్రమే కాకుండా అనేక అవార్డ్స్ అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడన్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ తోపాటు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

Anatomy Of a Fall OTT: ఓటీటీలోకి వచ్చిన ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Anatomy Of A Fall
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2024 | 8:17 AM

ప్రస్తుతం థియేటర్లలో టిల్లు స్క్వేర్ సినిమా సందడి చేస్తుంది. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసిన నటించిన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తుంది. మార్చి 29న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అటు ఓటీటీలోనూ హారర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అదే అనాటమీ ఆఫ్ ఏ ఫాల్. ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెంచ్, ఇంగ్లీష్ తోపాటు.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే ఈ సినిమా 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అవార్డ్ అందుకుంది.ఈ ఏడాది ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డుల్లో మొత్తం ఐదు విభాగాల్లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నామినేట్ అయ్యింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఈ సినిమా నామినేషన్స్ జరిగింది. ఇందులో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. కేవలం అకాడమీ అవార్డ్ మాత్రమే కాకుండా అనేక అవార్డ్స్ అందుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడన్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ తోపాటు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాలో హల్లర్ కీలకపాత్ర పోషించింది. ఇందులో తనదైన నటనతో మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఇందులో స్వాన్ అర్లాడ్, మిలో మకాడో గ్రానర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జస్టిన్ ట్రియెట్ దర్శకత్వం వహించారు. ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ అందుకుని..సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

కథ విషయానికి వస్తే.. సాండ్ర వోయిటర్ తన కుటుంబంతో కలిసి మంచు కొండలలో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఒకరోజు సాండ్ర భర్త అనుమానస్పద రీతిలో మరణిస్తాడు. అక్కడ కేవలం సాండ్ర ఫ్యామిలీ మాత్రమే ఉండడంతో భర్తను తనే హత్య చేసిందని పోలీసులు అనుమానిస్తారు. చివరకు ఆ హత్య చేసింది ఎవరు ? ఈ నేరం నుంచి సాండ్ర ఎలా బయటపడింది? అన్నది కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ప్రేక్షకులను క్యూరియాసిటిని కలిగించాడు డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.