RCB vs KKR, IPL 2024: హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా.. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం

ఐపీఎల్ 2024 సీజన్ లో హోం గ్రౌండ్ లో ఆడిన జట్లన్నీ ఘన విజయం సాధించాయి. అయితే ఈ అనుకూలతను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు. శుక్రవారం (మార్చి 29) కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

RCB vs KKR, IPL 2024: హోం గ్రౌండ్‌లో బెంగళూరు బోల్తా.. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా ఘన విజయం
RCB vs KKR Match
Follow us

|

Updated on: Mar 29, 2024 | 11:30 PM

ఐపీఎల్ 2024 సీజన్ లో హోం గ్రౌండ్ లో ఆడిన జట్లన్నీ ఘన విజయం సాధించాయి. అయితే ఈ అనుకూలతను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు. శుక్రవారం (మార్చి 29) కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. . ఈ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ పంజాబ్ ను ఓడించింది. అయితే ఇప్పుడు కోల్ కతా చేతిలో మరోసారి చిత్తైంది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు చెందిన ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ ల జోడీ శుభారంభం అందించింది. పవర్‌ప్లే మ్యాచ్‌లో వీరిద్దరూ దూకుడుగా ఆడి 6.3 ఓవర్లలో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సునీల్ నరైన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతనికి శ్రేయాస్ అయ్యర్ మద్దతుగా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా వికెట్లను త్వరగా పడగొట్టడంలో బెంగళూరు బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. . మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ విశాక్ మినహా మిగతా బౌలర్లలో ఎవరూ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ కూడా విఫలమయ్యారు. యశ్ దయాల్ మాత్రమే ఒక వికెట్ తీశాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి