Nikhil Siddhartha: టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నారా లోకేశ్‌

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ శుక్రవారం (మార్చి 29) తెలుగు దేశం పార్టీలో చేరాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ కు టీడీపీ కండువా కప్పీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ని

Nikhil Siddhartha: టీడీపీలో చేరిన హీరో నిఖిల్.. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నారా లోకేశ్‌
Nara Lokesh, Nikhil Siddhartha
Follow us

|

Updated on: Mar 29, 2024 | 10:06 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ శుక్రవారం (మార్చి 29) తెలుగు దేశం పార్టీలో చేరాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ కు టీడీపీ కండువా కప్పీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నిఖిల్ రాజకీయాల్లోకి రానున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించలేదీ యంగ్ హీరో. అభిమానులు కూడా అవన్నీ పుకార్లే అని అనుకున్నారు. అయితే సడెన్ గా టీడపీలో చేరి ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు నిఖిల్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ టీడీపీలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. అతను కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? లేదా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీడీపీ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాబట్టి నిఖిల్ టీడీపీ తరఫున ఏపీలో ప్రచారం చేస్తాడని తెలుస్తోంది. మరి టీడీపీ అధిష్టానం ఈ టాలీవుడ్ హీరోకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.

సుమారు 16 ఏళ్ల క్రితం హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమ్యడు నిఖిల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యువత, ఓం శాంతి, స్వామిరారా, కార్తి కేయ, శంకరా భరణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిర్రాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ మధ్యన 18 పేజెస్, స్పై సినిమాలు నిరాశపర్చినా స్వయంభు అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్టుతో త్వరలోనే మన ముందుకు రానున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు నిఖిల్. అప్పుడప్పుడూ సామాజిక సమస్యలపై తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటాడంతే. ఇటీవల కూడా భారత ఫుట్ బాల్ జట్టు దీన పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏకంగా రాజకీయాల్లోకి అడుగపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.