AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో వెయిట్ చూస్తున్నారు.

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే?
Pushpa 2
Balu Jajala
|

Updated on: Mar 29, 2024 | 10:05 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. అయితే ఈ మూవీ కీలక అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలోనే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, అజయ్ తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులు ఆసక్తితో ఉన్నారు. అయితే రిపోర్ట్స్ ప్రకారం.. పుష్ప: ది రూల్ సినిమా విడుదలకు నాలుగు నెలల ముందు అంటే ఏప్రిల్ లో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఇది స్పెషల్ ఇయర్. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన పుష్ప పార్ట్1 నిలిచిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2 విడుదల కానుండటంతో 2024 ఆయనకు మరింత స్పెషల్ గా మారనుంది. అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి 21 ఏళ్ల క్రితం మార్చి 28న విడుదలైంది. సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ఈ ఐకాన్ స్టార్  సర్ ప్రైజ్ లు ఇచ్చే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?