Daniel Balaji Death: ‘మిస్ యూ అన్నా’.. డేనియల్ బాలాజీ సాయాన్ని గుర్తు చేసుకున్న సందీప్ కిషన్

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మార్చి 29న గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం (మార్చి 29) గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Daniel Balaji Death: 'మిస్ యూ అన్నా'.. డేనియల్ బాలాజీ సాయాన్ని గుర్తు చేసుకున్న సందీప్ కిషన్
Daniel Balaji, Sundeep Kishan
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2024 | 8:46 PM

తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మార్చి 29న గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం (మార్చి 29) గుండెపోటుకు గురైన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 48 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన డేనియల్ మృతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు ఎమోషనల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు సందీప్ కిషన్ డేనియల్ బాలాజీ హఠాన్మరణంపై ఎమోషనల్ అయ్యాడు. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ సందర్భంగా డేనియల్ హఠాన్మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేశాడు సందీప్ కిషన్ .అలాగే తన సినిమా కెరీర్ కు డేనియల్ అందించిన సహకారాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు డేనియల్ అన్నా నాకెంతో అండగా నిలిచారు. నాతో ఎప్పుడూ దయగా ఉండే వ్యక్తి ఆయన. నటన పట్ల నా అభిరుచి గురించి తెలుసుకున్న ఆయన తన పలుకుబడిని ఉపయోగించి నన్ను చాలా అడిషన్లకు పంపారు. నీ అందమైన మనసును, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అన్నా. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎమోషనల్ ట్వీట్ చేశాడు సందీప్ కిషన్.

సందీప్ కిషన్ ట్వీట్..

షాక్ అయ్యాను: లావణ్య త్రిపాఠి..

డేనియల్‌ బాలాజీ మరణ వార్త విని తాను చాలా షాక్ అయ్యానంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయనకు సంతాపం తెలిపారామె. ‘ డేనియల్ బాలాజీ మరణ వార్త విని నేను చాలా షాక్‌ అయ్యాను. మంచి మనసు, ప్రతిభ ఉన్న వ్యక్తి లోకం విడిచివెళ్లిపోవడం తీరని విషాదం’ అని ట్వీట్ చేసింది లావణ్య త్రిపాఠి. వీరితో పాటు కమల్ హాసన్, నాని, సూర్య తదితరులు డేనియల్ మరణానికి సంతాపం తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.