Premalu OTT: బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఈ మధ్యన ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగు ఆడియెన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. హైదరాబాద్ నేటివిటీతో సినిమా ఉండడం, యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో యువత ప్రేమలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తె

Premalu OTT: బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమలు' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Premalu Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 01, 2024 | 3:37 PM

ఈ మధ్యన ఒక చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగు ఆడియెన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. హైదరాబాద్ నేటివిటీతో సినిమా ఉండడం, యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో యువత ప్రేమలు సినిమాకు బ్రహ్మరథం పట్టారు. తెలుగులో ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేయడం విశేషం. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు సినిమాలో స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. కేవలం 10 కోట్లతో తెరకకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.  అయితే తెలుగు వెర్షన్ హక్కులు మాత్రం ఆహా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12 నుంచి ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.  మలయాళం, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా, తెలుగు వెర్షన్ మాత్రం ఆహాలో అందుబాటులోకి రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

రెండు వారాలు ఆలస్యంగా స్ట్రీమింగ్..

కాగా మొదట మార్చి 29 నుంచి ప్రేమలు సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు ప్రచారం సాగింది. అయితే అదేమీ జరగలేదు. ఇప్పుడు రెండు వారాలు ఆలస్యంగా ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్, సంగీత్ ప్రతాప్, అఖిలా భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీం, షమీర్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

తెలుగు లోనూ అందుబాటులోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే