Iskcon: భగవద్గీత గొప్పతనం తెలిపే షార్ట్ ఫిల్మ్.. అత్తాపూర్ ఇస్కాన్‌లో షూటింగ్ పూర్తి.. త్వరలో రిలీజ్
నేటి తరానికి కూడా కృష్ణుడు తత్వాన్ని, భగవద్గీత గొప్పదనాన్ని తెలియజేయడం కోసం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది. ముందుగా ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తోంది ఇస్కాన్ సంస్థ. తమ ప్రయత్నాన్ని కార్యరూపం దాల్చేలా భగవద్గీత గొప్పదనాన్ని తెలియజేసేలా షార్ట్ ఫిల్మ్ తీసే భాధ్యతను టాలీవుడ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడికి అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలో ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుపుకుంది.
హిందూ సనాతన ధర్మాన్ని, కృష్ణ తత్వాన్ని తమ కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేస్తున్న సంస్థ ఇస్కాన్. శ్రీ కృష్ణుడు తత్వాన్ని, గీతా సారాన్ని ప్రపంచానికి భోదిస్తూ దేశ విదేశాల్లో శ్రీ కృష్ణుడి ఆలయాలను స్థాపించి నేటి తరానికి కూడా కన్నయ్యను పరిచయం చేస్తోంది. అంతేకాదు పేదవాడి ఆకలిని అక్షయ పాత్ర ద్వారా తీరుస్తుంది. అయితే ఇస్కాన్ సంస్థ మరో అడుగు ముందుకు వేసి.. నేటి తరానికి కూడా కృష్ణుడు తత్వాన్ని, భగవద్గీత గొప్పదనాన్ని తెలియజేయడం కోసం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తోంది. ముందుగా ఓ షార్ట్ ఫిల్మ్ ని తెరకెక్కిస్తోంది ఇస్కాన్ సంస్థ. తమ ప్రయత్నాన్ని కార్యరూపం దాల్చేలా భగవద్గీత గొప్పదనాన్ని తెలియజేసేలా షార్ట్ ఫిల్మ్ తీసే భాధ్యతను టాలీవుడ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడికి అప్పగించారు. ఇప్పటికే హైదరాబాద్ అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలో ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ జరుపుకుంది. ఈ షార్ట్ ఫిలింకి ‘డివైన్ మెసెజ్ 1’ అనే పేరు పెట్టారు.
డివైన్ మెసెజ్ 1 ఫిల్మ్ కు ఇస్కాన్ ప్రతినిధి ‘సచినందన్ హరిదాస్ కథ అందించారు. సీతారాం ప్రభు ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో ‘డివైన్ మెసెజ్ 1’ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సహా పలు ఓటీటీ ప్లాట్ ఫార్మస్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీతని నేటి తరానికి తెలియజేయడం కోసం చేస్తున్న నిర్మాణ సంస్థ ప్రయత్నం అభినందనీయం అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత కొనసాగింపుగా డివైన్ మెసెజ్ పార్ట్ 2, 3 , 4 ఇలా ఉండొవచ్చు అని తెలుస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..