Pakistan: యువకుడితో చెల్లెలు మాట్లాడిందని చంపేసిన అన్న.. వినోదంగా చూసిన తండ్రి.. వీడియో తీసిన మరో అన్న
పంజాబ్ ప్రావిన్స్‌లోని తోబా టేక్ సింగ్ లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్ ఫైసల్ అనే సోదరుడు తన సోదరి నోటికి దిండు పెట్టి ప్రాణం ఎలా తీశాడో ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అదే మంచంపై కూర్చున్న తండ్రి అబ్దుల్ సత్తార్ మౌనంగా కూతురి మరణాన్ని చూస్తున్నాడు. మరో సోదరుడు షాబాజ్ వీడియోలు తీస్తున్నాడు. తన కూతురిని కాపాడేందుకు తండ్రిగానీ, వీడియో తీస్తున్న సోదరుడికి గానీ ప్రయత్నం చేయలేదు..
దాయాది దేశం పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ అమాయక బాలిక పరువు హత్యకు గురైంది. తన సోదరుడి చేతిలో చెల్లెలు మరణించింది. వీడియో కాల్‌లో అబ్బాయితో మాట్లాడడమే అమ్మాయి చేసిన తప్పు. అమ్మాయితో మాట్లాడిందని తన సోదరిని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. విశేషమేమిటంటే ఇలా చెల్లెల్ని అన్న చంపేస్తున్న సమయంలో ఆ బాలిక తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. తండ్రి తన కుమార్తె మరణించిన దృశ్యాన్ని మౌనంగా చూస్తుండగా.. మరొక అన్న హత్య చేస్తుండగా తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
పంజాబ్ ప్రావిన్స్‌లోని తోబా టేక్ సింగ్ లో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్ ఫైసల్ అనే సోదరుడు తన సోదరి నోటికి దిండు పెట్టి ప్రాణం ఎలా తీశాడో ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అదే మంచంపై కూర్చున్న తండ్రి అబ్దుల్ సత్తార్ మౌనంగా కూతురి మరణాన్ని చూస్తున్నాడు. మరో సోదరుడు షాబాజ్ వీడియోలు తీస్తున్నాడు. తన కూతురిని కాపాడేందుకు తండ్రిగానీ, వీడియో తీస్తున్న సోదరుడికి గానీ ప్రయత్నం చేయలేదు.. ప్రాణం కోసం గిలాగిలాడుతున్న తన సోదరిపై జాలి కలగలేదు. ఇద్దరి వ్యక్తుల ముందే బాలిక హత్యకు గురైంది.
వీడియో కాల్‌లో అబ్బాయితో మాట్లాడటంపై అసంతృప్తి
ఈ హత్యానంతరం తండ్రి ముఖంలో విషాదం గాని, సోదరుడి ముఖంలో బాధ ఛాయలు గాని కనిపించలేదు. హత్య చేసిన తర్వాత ప్రశాంతంగా, హాయిగా కూర్చున్నాడు. ఈ ఘటన జరిగిన సమయంలో బాలిక తల్లి కూడా గదిలోనే ఉన్నట్లు సమాచారం.
సమాచారం ప్రకారం అమ్మాయి వీడియో కాల్ ద్వారా ఒక అబ్బాయితో మాట్లాడింది. ఈ విషయం ఆ యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ యువతిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మార్చి 17వ తేదీన జరిగింది.
హత్య చేసిన తర్వాత కుమారుడికి మంచి నీళ్లు ఇచ్చిన తండ్రి
ఈ వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. కుటుంబం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి మరణించింది.. ఇక అక్కడ నుంచి లే అని షహబాజ్ చెప్పింది కూడా వీడియోలో రికార్డ్ అయింది. అయినప్పటికీ ఫైసల్ దాదాపు 2 నిమిషాల పాటు తన సోదరి గొంతును పట్టుకుని ఉన్నాడు. కూతురిని చంపిన తర్వాత తన కొడుకు ఫైసల్ కు తండ్రి స్వయంగా మంచి నీరు తాగించాడు.
నిందితులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసు అధికారి అతావుల్లా ప్రకారం మార్చి 24 న పోలీసులకు బాలిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిసింది. ఆ తర్వాత పోలీసులు తండ్రి సత్తార్, హంతకుడు ఫైజల్‌లను అరెస్టు చేశారు. గత శనివారం వీడియో రూపొందించిన షాబాజ్‌ను కూడా అరెస్టు చేశారు. హత్య సమయంలో గదిలో ఉన్న బాలిక తల్లి కూడా వీడియోలో కనిపించిందని పోలీసులు చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..