Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insult Woman: విమానంలో మహిళకు అవమానం.. ఆ దుస్తులు ధరించలేదంటూ.!

Insult Woman: విమానంలో మహిళకు అవమానం.. ఆ దుస్తులు ధరించలేదంటూ.!

Anil kumar poka

|

Updated on: Apr 01, 2024 | 12:07 PM

విమాన ప్రయాణంలో ఓ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. బ్రా ధరించని కారణంగా తనను విమానం నుంచి ఆమెను దించేస్తామని బెదిరించారంటూ అమెరికాకు చెందిన మహిళ ఒకరు డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికీ వివక్షే నని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికాకు చెందిన లిసా ఆర్చ్‌బోల్డ్ అనే 38 ఏళ్ల మహిళ బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్‌తో ఫ్లైట్ ఎక్కారు.

విమాన ప్రయాణంలో ఓ మహిళకు తీవ్ర అవమానం జరిగింది. బ్రా ధరించని కారణంగా తనను విమానం నుంచి ఆమెను దించేస్తామని బెదిరించారంటూ అమెరికాకు చెందిన మహిళ ఒకరు డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది ముమ్మాటికీ వివక్షే నని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికాకు చెందిన లిసా ఆర్చ్‌బోల్డ్ అనే 38 ఏళ్ల మహిళ బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్‌తో ఫ్లైట్ ఎక్కారు. తన ఎద బయటకు కనిపించనప్పటికీ కవర్ చేసుకోవాలంటూ మహిళా సిబ్బంది ఆమెను కోరారని పేర్కొన్నారు. జనవరిలో జరిగిన ఈ ఘటన గురించి తాజాగా లాస్ ఏంజెలెస్‌లో విలేకరులకు ఆమె వెల్లడించారు. ఫ్లైట్ సిబ్బంది అలా చెప్పడం తనకు తీవ్ర అవమానంగా అనిపించిందన్నారు. తాను స్త్రీని కానని భావించి తనను లక్ష్యంగా చేసుకుని ఆమె అలా ప్రవర్తించినట్టు తనకు అనిపించిందని ఆమె పేర్కొన్నారు. డీజే అయిన ఆర్చ్‌బోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.

తన వస్త్రధారణ బహిర్గతం, ఆక్షేపణీయంగా ఉందని, కాబట్టి ఆ దుస్తులతో తనను విమానంలోకి అనుమతించబోమని డెల్టా సిబ్బంది తనకు చెప్పారని వివరించారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు. ఈ వివక్షాపూరిత విధానంపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేస్తూ ఆర్చ్‌బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ తెలిపారు. పురుషులు తమ టీ షర్టులను జాకెట్ల‌తో ఎలా అయితే కప్పుకోరో, మహిళలుకు కూడా అలాంటి అవసరం లేదని ఆమె వాదించారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని ఆల్రెడ్ తెలిపారు. ఆమె ఆయుధాలు ధరించలేదని, వారు రొమ్ములు కలిగి ఉండడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పినట్టు తెలిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Apr 01, 2024 12:07 PM