Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ ఈ తాత ఎం చేసాడో తెలుసా.? వీడియో వైరల్.
సామాన్యుడు అన్ని కష్టాలు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకునే ఏకైన సాధనం సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లో లీనమైపోయి అనుభవించే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది తనివితీరా ఆస్వాదించే ఓ మధురానుభూతి. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు, నవరసాలతో ప్రేక్షకుడిని అలరించే ఏ సినిమానైనా ఆదరిస్తారు ఆడియన్స్.
సామాన్యుడు అన్ని కష్టాలు మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకునే ఏకైన సాధనం సినిమా. సినిమా చూస్తున్నంతసేపూ ఆ పాత్రల్లో లీనమైపోయి అనుభవించే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. ఎందుకంటే అది తనివితీరా ఆస్వాదించే ఓ మధురానుభూతి. అలాంటి ఫీలింగ్‌ను కలిగించే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. సినిమా చిన్నదా, పెద్దదా అన్నది కాదు, నవరసాలతో ప్రేక్షకుడిని అలరించే ఏ సినిమానైనా ఆదరిస్తారు ఆడియన్స్. ఇది చాలా సందర్భాల్లో రుజువైంది. తాజాగా మరోసారి అలాంటి సన్నివేశమే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పెద్దాయన టిల్లు స్క్వేర్ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లాడు. సినిమాలో అనుపమ పరమేశ్వరన్-సిద్ధూ జొన్నలగడ్డ మధ్య సాగే ఓ రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతూ ఉంది. సరిగ్గా అప్పుడే అనుపమ ఇచ్చిన ఓ ఎక్స్‌ప్రెషన్‌కి కుర్రాడిలా మారిపోయాడు పెద్దాయన. ఆ సీనులో లీనమైపోయి తెగ ఎంజాయ్ చేశాడు. ఆ సన్నివేశాన్ని చూస్తూ తనలో తానే ముసిముసినవ్వులు నవ్వుకున్నాడు. ఈ వీడియోను ఎవరో పక్కన కూర్చున్న కుర్రాళ్లు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఒక్క దెబ్బతో వైరల్ అయిపోయాడు ఈ తాత. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈయన ది లెజెండ్ తాత, ముసలాడే కానీ మహానుభావుడు, కుర్చీ తాత తర్వాత ఈయనే ఫేమస్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా సినిమా చూస్తున్నప్పుడు ఈ పెద్దాయన రియాక్షన్ మాత్రం అదిరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.