Premalu OTT: ‘ఆహా’.. ప్రేమలు ఓటీటీ రిలీజ్‌లో ఊహించని ట్విస్ట్
'ప్రేమలు' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 135 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే తెలుగు వెర్షన్ మాత్రం....
చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.. ‘ప్రేమలు’. మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురపించింది. కేవలం 10 కోట్లతో తెరకకెక్కిన ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీకి యూత్ ఫిదా అయ్యారు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో గిరీష్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లెన్ కె గఫూర్- మమితా బైజు కీ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో.. రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులో విడుదల చేశారు. రాజమౌళి కూడా ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేయడంతో.. బాగానే జనాల్లోకి వెళ్లింది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్ట్రీమింగ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఓ అప్‌డేట్ అయితే ఫిల్మ్ సర్కిల్‌లో తెగ వైరల్ అవుతుంది.
ఈ మూవీ ఏప్రిల్ 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుందని కొన్ని రోజులుగా న్యూస్ సర్కులేట్ అవుతుంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ‘ఆహా’లోకి రాబోతుంది అన్నది లేటెస్ట్ టాక్. ఇది కూడా ఏప్రిల్ 12న ‘ఆహా’లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా హీరోయిన్ మమితా బైజు యాక్టింగ్, క్యూట్ లుక్స్‌కు కుర్రాళ్లు ఓ ఫిదా అయిపోయారు. ఆమె పెద్ద స్టార్ అవుతుందంటూ రాజమౌళి కూడా జోస్యం చెప్పారు. ఈ కేరళ అందాన్ని తెలుగులోకి తీసుకురాడానికి చాలామంది మేకర్స్ ప్రయత్నాలు షురూ చేశారు. అవకాశాలు చాలానే వస్తున్నాయి కానీ, అన్నీ చేయను. నచ్చితేనే చేస్తా అంటోంది ఈ బ్యూటీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.